Friday, 12 June 2015

కైరీగూడలో జెండావిష్కరణ

రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలోని కైరీ గూడలో ఐఎన్‌టీయూసి అనుబంద సింగరేణి స్టాప్‌, కార్మికులు జెండావిష్కరించారు. ప్రధాన కార్యదర్శి జనక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు ఉన్న జేఐటీయూసి సంఘ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలం చెందాయని సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు చేసిన ఉద్యమం మరువలేమని అన్నారు. సకల జనుల సమ్మెలో వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని, వెంటనే వేతనాలు చెల్లించాలని, వచ్చిన లాభాల్లో వాటా 25 శాతం అందించాలని వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజలింగు, మల్లయ్య, మహేందర్‌ రావ్‌ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment