రెబ్బెన : మండలకేంద్రమైన రెబ్బనలో అం గన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ గ్రామ పంచాయతీ కార్యాలయం నుం చి ప్రారంభమై ప్రదాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సూపర్‌వైజర్లు లక్ష్మీ, భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ... ఒకటినుంచి ఆరు సంత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, ఈ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం మరియు పిల్లలు ఆడుకోవడానికి ఆటపాటలు నేర్పిస్తారని తెలిపారు. ఈ ర్యాలీలో అంగన్‌వాడీ కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment