Tuesday, 31 January 2017

అంటరానితనం నిర్ములణకు అందరూ పాటు పడాలి-జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అంటరానితనం నిర్ములణకు అందరూ   పాటు పడాలి-జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; హక్కుల దినోత్సవం(సివిల్ రైట్ డే)  సందర్బముగా జిల్లా ఎస్పీ  ప్రతి పొలిసు స్టేషను పరిథిలో అదికారులు ఇతర మండల  అదికారులతో కలిసి, మారు మూలా గ్రామాలలో అంటరానితనం పై  అవగహన సదస్సులను నిర్వహించాలని అదేశించారు.ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ మాట్లడుతూ  ఇప్పటికి మరుముల గ్రామాలలో ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాల పైన సివిల్ రైట్ చట్టలపైనా ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన అన్నారు చట్టాలు చాలా కఠినతరం అయినవి అని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతాయన్నారు.ఎస్పీ ఎస్టీ కులాల వారిని  అంటరాని వారిగా చూడడం  వారిని ఊరి నుండి బహిష్కరించడం గాని వేలి వేయడం గాని, దేవాలయాలకు అనుమతి నిరాకరించడం గాని   అంటరానితనం  పేరుతో హోటల్స్ లో సపరేట్  గ్లాస్ ఇవ్వడం  మరియు సహపంక్తి భోజనం చెయ్యడానికి వారిని  నిరాకరించటం చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అయన తెలిపారు ఇకపై ప్రతి నెల పొలిసు అదికారులు వారి మండల ఆఫీసర్ల తో కలిసి నెల చివరి రోజున మండల మరుముల గ్రామాలలో చట్టాలపై అవగహన కల్పిస్తారని తెలిపారు.

కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభము

కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభము 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; అభినవ సేవ సంస్థ ఆధ్వర్యములో నెహ్రు యువజన కేంద్ర సహకారముతో రెబ్బెన మండలకేంరములో ఉచిత కుట్టు శిక్షణాకేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వెంకటమ్మ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ లు మంగళవారం ప్రారంభించారు . ఈ సందర్బంగా అభినవ సంస్థ వ్యవస్థాపకుడు సంతోష్ మాట్లాడుతూ మహిళలు ఆర్ధిక స్వాలంబన సాధించాలన్నారు . ఈ కార్యక్రమములో  అధ్యక్షుడు అముర్ల ప్రవీణ్ , ప్రధాన కార్యదర్శి రాజ్ , జాయింట్ సెక్రెటరీ ప్రదీప్ , సతీష్ , సాయి బాబా యశోద , దీక్ష , లు ఉన్నారు.

తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించిన రాజస్వ మండలాధికారి


తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించిన రాజస్వ మండలాధికారి


కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; రెబ్బెన మండల తహసీల్ధార్ కార్యాలయాన్ని మంగళవారంనాడు ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి (ఆర్డీవో) పాండురంగరావు సందర్శించారు.కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్బంగ ఆయన మండలంలోని అస్సైన్డ్ భూములు,కాస్తులో ఉన్న భూముల వివరాలు తెలుసుకున్నారు.కల్యాణ లక్ష్మి పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగ  అందెలా చూడాలని అన్నారు.అదే విదంగ పెళ్లి నిశ్చయం కాగానే అర్హులు వెంటనే దరాఖాస్తు పెట్టుకోవాలని సూచించారు.గ్రామా,మండల సిబ్భంది,స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి గ్రామాలలో ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం,షాదీ ముబారక్,ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని,సరైన లబ్ధిదారులను ఎన్నుకోవాలని అన్నారు.ఆర్డీఓ తో తహసిల్ధార్ బండారి రమేష్ గౌడ్,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    

మాలమహానాడు నవేగం గ్రామా కమిటి ఎన్నిక


మాలమహానాడు నవేగం గ్రామా కమిటి ఎన్నిక

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; రెబ్బెన మండలంలోని నవేగం గ్రామా  మాలమహానాడు కమిటని ఎన్నుకోవడం జరిగిందని  మాలమహానాడు  కొమురంభీం జిల్లా ఉపాధ్యక్షులు జూపాక రాంచందర్,రెబ్బెన మండల అధ్యక్షులు జూపాక అనిల్ కుమార్ లు తెలిపారు.మంగళవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామా కమిటీ అధ్యక్షునిగ మల్లేపల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షుడిగ వేల్పుల రాజలింగు,కార్యదర్శిగ సోత్కు  కేశవ్,కోశాధికారిగ నల్లాల మల్లయ్య,కార్యవర్గ సభ్యునిగా మల్లేపల్లి శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. 

ఎఐఎస్ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి గ పర్వతి సాయికుమార్ ఎన్నిక

ఎఐఎస్ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి గ పర్వతి సాయికుమార్ ఎన్నిక 
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) రెబ్బెన మండల కార్యదర్శి గ నంబాలకు చెందిన ఇంటర్ విద్యార్థి  పర్వతి సాయికుమార్ ఎన్నుకోవడం జరిగిందని ఎఐఎస్ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ తెలియజేశారు.  సోమవారంనాడు రెబ్బెనలో ఏర్పాటు చేసిన మండల సమావేశంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిజేశారు.వారు మాట్లాడుతు  రెబ్బెన మండలంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు.విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పోరాటం చేయడంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ముందు ఉంటుందని అన్నారు.ఈ సందర్బంగ నూతనంగ ఎన్నికైన మండల కార్యక్యాదర్షి పర్వతి సాయి మాట్లాడుతు విద్యారంగ సమస్యలపై నిరంతర విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,తన పై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పిన జిల్లా,డివిజన్ కార్యదర్శులు దుర్గం రవిందర్,పూదరి సాయిలకు కృతజ్ఞతలు తెలిజేశారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మహిపాల్,జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్,గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షులు పూదరి హరీష్ పాల్గొన్నారు.

Monday, 30 January 2017

తహసీల్ధార్ కు సిపిఐ నాయకుల నాయకుల సన్మానం

తహసీల్ధార్ కు సిపిఐ నాయకుల నాయకుల సన్మానం  

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; రెబ్బెన ; గణతంత్ర దినోత్సవం సందర్బంగ కుమురం భీమ్  జిల్లా లోనే ఉత్తమ తహసిల్ధార్ గ అవార్డు పొందిన రెబ్బెన మండల్ తహశసిల్ధార్ బండారి రమేష్ గౌడ్ ను సోమవారం నాడు మండల సిపిఐ,ఎఐవైఎఫ్,ఎఐఎస్ఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,కోశాధికారి రాయిల్ల నర్సయ్య,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షులు పూదరి హరీష్ గోలేటి గ్రామా  రెవిన్యూ అధికారి మల్లేష్,రెబ్బెన గ్రామా రెవిన్యూ అధికారి ఉమ్లాల్  తదితరులు పాల్గోన్నారు.

అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవొద్దు-ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ  మరవొద్దు-ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; అమరవీరుల దినోత్సవం సందర్బముగా జిల్లా ఎస్పీ  సోమవారం తన క్యాంపు ఆఫీస్ లో ఉదయం పదకొండు గంటలకు  స్వతంత్ర సమర  యోదుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిముషాలు తమ ఆఫీసు సిబ్బంది తో సహా మౌనం పాటించారు. అదేవిదంగా జిల్లా వ్యాప్తముగా  ప్రతి పొలిసు స్టేషన్ పరిథిలో  అదికారులు తమ సిబ్బందితో  స్వాతంత్ర అమరవీరుల త్యాగాలను స్మరిస్తు  ప్రదాన కూడలిలో  ప్రజలతొ కలిసి   రెండు నిముషాలు  మౌనం పాటించాలని అదేశించారు. ఈ సందర్బముగా  జిల్లా ఎస్పీ గారు  మాట్లడుతూ ఎంతోమంది దేశ స్వాతంత్రము కొరకై  తమ ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రము సాధించారు. వారి త్యాగాలను మనం ఎప్పటికి మరవొద్దు. దేశ భవిష్యత్తు  నేటి యువత మీద ఉందని  అమరుల  త్యాగాలను  ఆదర్శముగా తీసుకోని దేశ సేవకు ఎప్పుడు ముందుండాలని అయన కొరారు. ఈ కార్యక్రమములో ఎస్ బి ఎస్ ఐ లు శ్యామ్ సుందర్ శివకుమార్ వెంకటస్వామి మరియు సిబ్బంది పాల్గోన్నారు.     

గాంధీ వర్ధంతి సందర్బంగా మౌనం

గాంధీ వర్ధంతి సందర్బంగా మౌనం

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ;  గాంధి వర్ధంతి సందర్బంగా మరియు స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు సోమవారం రెబ్బెనలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ  స్వతంత్య్ర ఉద్యమంలో అమరుల కొరకు మరియూ గాంధీ వర్ధంతి సందర్భంగా  మౌనం పాటించడం జరిగింది.దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ దారం సురేష్,ఈవోపిఆర్డి కిరణ్, నవీన్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్ ,ఆశోక్, రంగు మహేష్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

మహాధర్నా ను విజయవంతం చేయండి; ఎఐఎస్ఏఫ్

మహాధర్నా ను విజయవంతం చేయండి; ఎఐఎస్ఏఫ్

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ;  కుమురం బీమ్ (వుదయం ప్రతినిధి)రెబ్బెనరాష్ట్రంలో విద్యా,వైద్యం,ఉపాధి హక్కుల సాధనకై ఎఐఎస్ఏఫ్,ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో ఫిబ్రవరి 2 నాడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని యువకులు,విద్యార్థులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు విశ్రాంతి  ఏర్పాటు  చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం, రాష్ట్రంలో టి.ఆర్. ఎస్.ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సమస్యలు విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగంలో మత పరమైన విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టేందుకు సంస్కరణలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో కె.జి. టూ పి.జీ. ఉచిత విద్యా విధానం అమలు చేయాలని,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్టు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, యస్.సి.,యస్.టి.,బి.సి.కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకున్నవారందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ లతో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని మహాధర్నాను జయప్రదం చేయుటకు విద్యార్థులు,యువజనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల కార్యదర్శి పర్వతి  సాయికుమార్, గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షుడు పూదరి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 28 January 2017

తెరాస మహిళా విభాగం నుంచి తహశిల్దార్ కు సన్మానం


తెరాస మహిళా విభాగం నుంచి తహశిల్దార్ కు  సన్మానం  


కొమరం భీం ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 29 ;      గణతంత్ర దినోత్సవము రోజున  ఉత్తమ తాసిల్దార్  గా ప్రసంశ పత్రాన్ని జిల్లా కలెక్టర్ చంపాలాల్ చేతులు మీదగా  తీసుకున్న రెబ్బెన తహశిల్దార్ బండారి రమేష్ గౌడ్ ను శనివారం  తెరాస మహిళా విభాగం నుంచి సన్మానా  కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా తలిసిల్దార్ మాట్లాడుతూ  మండల ప్రజలు మరియు  రైతుల  కృషి సహకారంతో పొందినది  అని అన్నారు. మండల ప్రజలకు, నాయకులకు మరియు  రైతులకు ధన్యవాధాలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఏ ఎం సి ఉపాద్యాక్షురాలు కుందారపు శంకరామ్మా, బి శంకరామ్మా, బి దేవక్క , పి సుగుణ దేవి, సత్యనారాణ,  సోమయ్య, శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.

లక్షల్లో నష్ట పరుస్తున్న నాయకులు

లక్షల్లో నష్ట  పరుస్తున్న నాయకులు 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 28 ;  బెల్లం పల్లి ఏరియా లోని గోలెట్ 1 , 1ఏ గనులలో బొగ్గు పెళ్ల రాకున్నా కంపెనీ , యూనియన్ నాయకులు కుమ్మక్కై లక్షల్లో నష్ట పరుస్తున్నారని టి ఆర్ ఎస్ రెబ్బెన కార్మిక సంఘ అధ్యక్షుడు, టి బి జి కె ఎస్ టౌన్ అధ్యక్షుడు గజ్జెల ప్రకాష్ రావు అన్నారు . కార్మిక సంఘ నాయకులు నచ్చ్చిన కార్మికులను ట్రాన్స్ఫర్ పేరు మీద కాళ్ళు అరిగేలా తిప్పిచించుకున్నరని తెలిపారు . కంపెనీ, యూనియన్ నాయకులు ఏకమై తమ చుట్టూ తిప్ప్పు కుంటూ, పబ్బం గడుపుతున్నారని అన్నారు.  కార్మికుల కష్టాలను గుర్తించకుండా కష్టపెడుతున్నారని తెలిపారు . ఇటువంటి కార్మికసంఘ నాయకులను ఉండకుండా చూడాల్సిన బాధ్యత కార్మకుల పై ఉందని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి గనులను అభివృద్ధి పరుస్తూ  ఉంటె , కొందరు నాయకుల ద్వారా అపకీర్తి వస్తుందని అన్నారు.

నట్టల మందు పంపిణి

 నట్టల  మందు పంపిణి 


కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 28 ;  రెబ్బన మండలం లోని పసిగామ్ . వరదల గూడం గ్రామాలలో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం నట్టల  నివారణ మందులు  పంపిణి చసినట్ల  సాగర్ తెలిపారు. గ్రామాలలో 1238 పశువులకు నట్టల  నివారణ మందు పంచినట్లు తెలిపారు. మొత్తం గ్రామాలలో పశువుల జబ్బులు బారిన పడితే తమని సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్  ముంజం రవీందర్, డాక్టర్ ఎం ఎం ఖాన్, డాక్టర్ వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో రెబ్బన ఆరోగ్యకేంద్రం

అభివృద్ధిలో రెబ్బన ఆరోగ్యకేంద్రం

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 28 ;  రెబ్బన మండలం లో ని ప్రజల సౌకర్యార్థం ప్రాధమిక ఆరోగ్య కేద్రం లో పనిచేస్తున్న డా.సంతోష్ సింగ్ అభివ్రుది కమిటీ ఏర్పాటు చేసి ఆరోగ్య కేంద్రాములో అరకొరగా ఉన్న సౌకర్యాలతో కొనసాగుతున్న వైద్య సేవలను డా.సంతోష్ సింగ్ వారి కమిటీ ముందుకు వచ్చి స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని మోలీక సదుపాయాలతో మెరుగైన వైద్యం కొరకు ప్రసూతి గదులు మరియు పతా భవనాలను మరమత్తు చేసి ఆకర్షణీయంగా తయారు చేసి వైద్య సదుపాయాలను చేకూర్చారు ఆసుపత్రి నిర్వహణ కోసం పభత్వం నుండి 1.7 లక్షలు అందుబాటులో ఉండగా మొత్తం నిర్వహణ మరమత్తుల ఖర్చులు 4 లక్షలు అవ్వగా వైద్య అధికారి డా.సంతోష్ సింగ్ తగూర్ తన సొంత జీత బత్యా ల తో రుసుము ని కలుపుకొని స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తో వైద్య కేంద్రాన్ని పురోభివృద్ధి సాధించారు ఉన్నత సేవ లు అందిస్తున్న డాక్టర్ సంతోష్ సింగ్ ఠాగూర్ ను ఉత్తమ సేవలకు  ఘనతంత్రదినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ చంపాలాల్ అవార్డు ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉంది , ప్రజా ప్రతినిధులు , నాయకులు డాక్టర్ను అభినందించారు.

Friday, 27 January 2017

రెబ్బెన తాసిల్దార్కి ఘాన సన్మానం

రెబ్బెన తాసిల్దార్కి ఘాన సన్మానం  


కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 27;  ఉత్తమ తాసిల్దార్  గా గణతంత్ర డొనోత్సవము రోజున ప్రశంస పత్రాన్ని అందుకున్న తలిసిల్దార్ బండారి రమేష్ గౌడ్ ను రెబ్బెన తలిసిల్దార్ కార్యాలయ సిబ్బంది , వివిధ పార్టీ నాయకులూ మరియు కుల సంగలవారు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్బంగా తలిసిల్దార్ మాట్లాడుతూ ఈ గౌరవం నా తోటి సిబ్బంది ,  మండల ప్రజలదే అని అన్నారు. రాబోవు రోజుల్లో ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బాప, అశోక్, మల్లేష్, ఉమ్ లాల్,   వివిధపార్టీలు మరియు కుల సంఘ నాయకులూ జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, మోడెమ్ సర్వేశ్వర్ గౌడ్,రంగు మహేష్ గౌడ్, కొయ్యడ రాజా గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, ఎం వెంకటేశ్వర్ గౌడ్, సోమశేఖర్, చిటిబాబు, వస్రం కుమార్ నాయక్, లావుడ్య రమేష్ తదితరులు ఉన్నారు.

దళిత ఇండియన్ ఛాంబర్ అఫ్ కామెర్స్ ఇండస్ట్రీస్ మంచిర్యాల జిల్లా జిల్లా కోఆర్డినేట్ గా శోభన్ బాబు

దళిత ఇండియన్ ఛాంబర్ అఫ్ కామెర్స్ ఇండస్ట్రీస్ మంచిర్యాల  జిల్లా జిల్లా కోఆర్డినేట్ గా శోభన్ బాబు 
  
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 27;  ఛైర్మెన్  దళిత ఇండియన్ ఛాంబర్ అఫ్ కామెర్స్ ఇండస్ట్రీస్ మంచిర్యాల  జిల్లా కోఆర్డినేట్ గా శోభన్ బాబు ను ఎన్నుకున్నట్లు  డిక్కీచాప్టర్ వ్యవస్థాపక ఛైర్మెన్ మిలింద్ కామ్ లే తెలిపారు . కొమురం భీం  జిల్లా ఆసిఫాబాద్ లో రెబ్బెన మండలనికి చెందిన  వ్యక్తి శోభన్ బాబు అని   డిక్కి వ్యవ్యస్థపక చైర్ మెన్ కమల్ లే అన్నారు . ఆయన  మాట్లాడుతూ దళిత కార్మిక వేత్తలుగా తాయారు చేసే భాద్యత కోఆర్డినేటర్లకు ఉందన్నారు. మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్గా ఎంపికైన శోభన్ బాబు మాట్లాడుతూ  దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్టీస్ మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్ గా ఎంపిక చేసినదులకు  డిక్కీ తెలంగాణా చాప్తర్ అధ్యక్షుడు రాహుల్ కిరణ్ కు ధన్యవాదాలు తెలిపారు . ఈ బాధ్యత ఇఛ్చినందులకు జిల్లాలోని దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడములో నా వంతు కృషి చేస్తానని అన్నారు . ఈ కార్యక్రమములో డిక్కీ సౌత్ ఇండియన్ అధ్యక్షులు నర్రా రవికుమార్ , తెలంగాణ చాఫ్టర్ అధ్యక్షుడు రాహుల్ కిరణ్ ఉన్నారు.

తెలంగాణ బొగ్గుగని ఆయుర్భావ వేడుకలు

తెలంగాణ బొగ్గుగని ఆయుర్భావ వేడుకలు 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 27;  తెలంగాణ బొగ్గు కార్మిక గని  సంగం 14 వ అవసర్బావ వేడుకలను గోలేటి లోని టీ  బి జి కె ఎస్ కార్యలయం నందు ఘనంగా నిర్వహించారు బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు నల్గొండా సదాశివ్ కార్యాలయం నందు జండాను ఎగరువేశారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసమే ఆవిర్భవించిన కార్మికుల  సంగమే   టీ బి జి కె ఎస్  సంగం అన్నారు ఆవిర్భావ సమయం లో కార్మికులకు ఇచ్చిన హామీల అన్నిటిని నిరవేర్చిన సంగం తమ సంగమే అన్నారు వారసత్వ ఉద్యోగాల సాధనతో కార్మికులకు అందంగా ఉందన్నారు ఆనాటి సంఘాలు ఒక్క ఒక్క టిగా కార్మికుల హక్కులను హరిస్తున్న సంగం గ ఆవిర్భవిస్తున్న తమ సంగం కార్మికులకు ఎన్నో హక్కులను సాధించి పట్టిందన్నారు వారసత్వ ఉద్యోగాలను ప్రకటించిన సి ఎం కే సి ఆర్ కు నిజాం బాద్ ఎం పి కవితకు ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. 

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 27;  బెల్లం పల్లి ఏరియా;లోని ఓ సి 2 కు  అద్యప్రతిపర్యన 6 నెలలపాటు 4 విల్ డ్రైవ్ జిబ్ నడుపుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  డి  జి ఎం పర్సనల్ జ్ చిత్రజన్ కుమార్ తెలిపారు.  టెండర్ ఫారంలకు గోలాటి లోని  జి ఎం కార్యాలయం నందు  సంప్రదించగలరాని తలిపేరు పూర్తి చేసిన తెండర్ ఫోరములను  ఈ నేల31 మధ్యాహ్నం 12 గంటల లోపు అందజయాల్సిందిగా సూచించారు. పూర్తి వివరాలు జి ఎం ఆఫీస్ యందు సంప్రదించ వలసిందిగా  అయన కోరారు.

రోడ్లు బాగుఅయ్యేది ఎన్నడు ..... ?

రోడ్లు బాగుఅయ్యేది  ఎన్నడు ..... ?

 వాంకిడి  ( వుదయం ) జనవరి 27;  మండలం లోని గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని స్థానిక గిరిజన ప్రజల ఆవేదన మండలానికి దగరలో ఉన్నటు వంటి గ్రామా పంచాయితీ ల రోడ్డు పరిస్థితి ధారణం గ మారాడటం తో ఇబ్బందులకు గురవుతున్నాం అన్నారు పంచాయతీ రోడ్డు లే ఆలా ఉందంటే ఆ గ్రామానికి వల్లే రోడ్డు అదో గతి స్థానిక ఎన్నికల సమయం లో హామీలు పరిమితం అయ్యాయి వీటి కి మార్గం చూపే నాధుడే లేరని ఇక్కడి జనం అంటుంటే ఔను అనే చెప్పవచ్చు వెలిగే పంచాయితీకి రోడ్డు మంజూరు ఐనా ప్రారంభానికి నోచుకోలేదు పంచాయితీ లో 11 గ్రామాలకు అసలు రోడ్డు లేక గ్రామా ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఇందుకు రోడ్డు లే నిదర్శనంగా మరియు కిరిడి గ్రామా పంచాయితీ కి కనీసం 5 కి మీ బీటీ రోడ్డు లేక ఇక్కడి ప్రజలు గత కొన్ని సంవసరాల తరబడి ఇబ్బందులు తప్పడం లేదు ఇప్పటి కైనా అధికారులు గ్రామపంచాయితీలకు బిటి, మెటల్ రోడ్డు లు మంజూరు ప్రతిపాదనను  పంపించి ప్రజల సమస్యలను పరిష్కారానికి చేరువ కావాలని ప్రజలు కోరుచున్నారు.

Thursday, 26 January 2017

అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు ----జి ఎం


అంబుర్రాన్ని అంటిన గణతంత్ర సంబురాలు  ----జి ఎం 






కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 27 ;   సింగరేమి సంస్థ కార్మికుల రక్షణపై ప్రత్యక శ్రద్ధ వహిస్తున్నదని , కార్మికుల సంక్షేమము తో పాటు  ఉత్పత్తి కూడా అవసరమని బెల్లం పల్లి జీఎం కె రవిశంకర్ అన్నారు . గణతంత్ర దినోత్సవం సందర్బంగా గోలేటిలోని భీమన్న స్టేడియం లో జరిగిన సంబరాలలో ఆయన మాట్లాడారు . ముందుగా జీఎం పాఠశాల విద్యార్థులతో వందన స్వీకారం పొంది,  అనంతరము మాట్లాడారు .బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తి ఉత్పర్దకతలో సింగరేణిలో ముందజ ఉండడానికి కార్మికులు , సూపెర్విజెర్లు సహాకారము ఎంతో ఉందని ఇఛ్చిన లక్ష్యాన్ని నెరవేస్తామని అన్నారు . కార్మికుల సన్షేమము కోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు . సింగరేణి సేవ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు ఇచ్చ్చామని తెలిపారు . మహిళలకు కూడా ఎన్నో శిక్షణలు ఇచ్చ్చామని పేర్కొన్నారు . గణతంత్ర దినోత్సవం సందర్బంగా జీఎం ప్రత్యకముగా  తయారు చేసిన  వాహనంలో వచ్చారు . వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన పిరమిడ్లు,  డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి . అనంతరము జీఎం చేతుల మీదుగా బౌమతులను అందుకున్నారు ..ఈ కార్యక్రమములో డిజిఎం పర్సనల్ చిత్తరంజన్ , సేవ అధ్యక్షురాలు అనురాధ , అధికారులు సంజీవ రెడ్డి ,కొండయ్య టీబీజీకేఎస్ ఏరియా ఉపాద్యాక్షుడు నల్లగొండ సద్దశివ్ , ఏ ఐ టి యూ సి జిల్లా అధ్యక్షుడు సోమవారం తిరుపతి      ఇతర అధికారులు , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  ఉన్నారు.

మండలములో రెప రెపలాడిన జెండా

మండలములో రెప రెపలాడిన జెండా 
వాంకిడి ; మండలములో మువ్వన్నెల జెండా గురువారం రెప రెపలాడింది . మండలములోని తహశీల్ధార్ కార్యాలయములో తాహసీల్ధార్ మల్లికార్జున్ , ఎస్ ఐ రాజు , ఎంపిపి హార్థిక , జెడ్ పిటిసి అరిగేలా నాగేశ్వర్ రావు లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు . అదేవిదంగా వివిధ గ్రామాలలో సర్పంచులు జెడ్డాను ఆవిష్కరించారు . విద్యార్థులకు మిఠాయిలు పంచారు .

రెబెనలలో రేప రెపలాడిన మువ్వన్నెల జెండా

రెబెనలలో రేప రెపలాడిన మువ్వన్నెల జెండా 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 27 ;   రెబ్బన మండలములో మువాంనేలా జెండా గురువాము రోజు రెప రెపలాడింది . తహశీల్ధార్ కార్యాలయములో  తహశీల్ధార్ రమేష్ గౌడ్ , ఎంపిడిఓ కార్యాలములో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ , ఎం ఈ ఓ ఆఫీసు ఎం ఈ  ఓ వెంకటేశ్వర స్వామీ , హాస్పిటల్లో డాక్టర్ సంతోష్ సింగ్ , ఐకెపి లో ఏ పీఎం వెంకట రమణ , గ్రామ పంచాయతీలో సర్పంచ్ వెంకటమ్మ , వివిధ పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు . ప్రైవేటు పాఠశాలల విద్యార్థు ప్రధాన విధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారువిద్యార్థులు చేసిన డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి -కలెక్టర్


ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి -కలెక్టర్ 

 గణతంత్ర దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ జండా ఆవిష్కరణ

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 27 ;  ప్రభుత్వము అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కళేల్టార్  చంపాలాల్  అన్నారు .గణతంత్ర దినోత్సవము సందర్బంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి , వందన స్వీకారం పొందారు . ఆయన  మాట్లాతు  జిలాలో ప్రతీ శాఖలో ని అధికారులు తమ పనిని అంకిత భావముతో పనిచేస్తే జిలా సర్వత్రా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు .జిల్లా ను అభివృద్ధి దిశలో నడవాలంటే అధికారుల సహకారము తప్పనిసరని అన్నారు . అదే విదంగా ఎస్పీ కార్యాలయములో ఎస్పీ సుప్రీత్ సింగ్ , డి ఈ  ఓ కార్యలయములోడి ఈ  ఓ రఫీక్ , త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు .   వివిధ శాఖలలో ఉత్తమ అధికారులుగా ఎంపికైన వారికి  కలెక్టర్ చంపాలాల్ అవార్డులు అందజేశారు . ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అబ్బుర పరిచాయి . అనంతరము భౌహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమలో  ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్  , ఎం ఎల్ లు కోవా లక్ష్మి , కోనేరు కోనప్ప , ఇతర అధికారులు , నాయకులు పాల్గొన్నారు .    

Wednesday, 25 January 2017

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోపనిచేస్తున్న డాక్టర్ సంతోష్ సింగ్ కి ఘానా సన్మానం


 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోపనిచేస్తున్న  డాక్టర్  సంతోష్ సింగ్ కి ఘానా సన్మానం  



కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;   ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి లో డాక్టర్ గ కొనసాగుతూ ఆసుపత్రి ని తీర్చిదిద్దిన డాక్టర్ సంతోష్ సింగ్ ని బుధవారం ఘానంగా సన్మానించారు. ఆసుపత్రి రిపేర్ కి అయన సొంత జీతం నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చుతో నూతనంగా మరమ్మతులు చెయించిన  ఆపరేషన్ థియేటర్ ప్రారంబోస్తోవానికి వచ్చిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంఎల్ ఏ కోవా లక్ష్మిలు లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిగిన్ననాటి నుంచే ఈ పరిసర ప్రాంతోలలో చదువుకొని స్వగృహమైన మండల కేంద్రం లో ఉన్న ఆసుపత్రి లో డాక్టర్ గా కొనసాగుతూ సొంత వేయం తో ఆసుపస్త్రి మరమ్మతు కొనసాగించి అలాగే ప్రజల ఆరోర్గ్య పరిస్థిలను పరిశీలిస్తూ ఎనలేని సేవ చేశారన్నారు.  ఈ సందర్బంగా డాక్టర్ సంతోష్ సింగ్ కి మండలు  నాయకులు, మండల వాసులు  సన్మానించారు. ఈ మరమ్మతులకు తెరాస నాయకులు చిన్న సోమశేఖర్ 5వేళా రూ గాను, సుదర్శన్ గౌడ్ చెక్ రూపంలో అందించారు. ఎలాంటి డాక్టర్ మన మండలానికి రావటం ఎంతో అదృష్టమని మండల ప్రజలు అన్నారు.   ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ ఏ ఎం సి  కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక ,  సర్పంచ్ వెంకటమ్మ, సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్ తధీతరులు ఉన్నారు. 

రక్షణ తో కూడిన ఉత్పత్తిని సాదించాలి

 రక్షణ తో కూడిన ఉత్పత్తిని సాదించాలి



కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 26;  రెబ్బెన:  రక్షణ తో కూడిన ఉత్పత్తి ని సాధించి నప్పుడే సమస్త మనగడ కొనసాగుతుందని రక్షణ బృందం కుంవినేర్ ఫై ఉమామహేశ్వరీ  అన్నరు.   49వ రక్షణ వారోస్టోవాలా సందర్బంగా ఖైర్గుడా ఓపెన్ కాస్ట్  ను తనకి బృందం సందర్శించారు ఈ సందర్బంగా కన్వీనర్ ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు రక్షణ తో పని చేసి భద్యతగా వ్యవహరించాలన్నరు ప్రమాదాలు ఎక్కువగా మానవతప్పిదాల వలనే జరుగుతాయి అని అన్నారు రక్షణతో కూడిన ఉత్పత్తి ని సాధించి నప్పుడే సింగరేణి సమస్త మనుగడ కొనసాగుతుందని తెలిపారు యాజమాన్యం విధించిన ఉత్పత్తి లక్షలను ప్రతి కార్మికులు అధికారులు భద్యతగా వ్యవహరించి రక్షణతో ఉత్పత్తి లక్షలను సాధించాలన్నారు అనంతరం కమ్యూనికేషన్ సెల్ అద్వర్యం లో రక్షణపై అవగాహన గీతాలు , నాటికను ప్రదర్శించి కార్మికులకు అవగాహన్ కల్పించారు ముందుగా రక్షణ బృందం అధికారులను ఏరియా జీఎం రవి శంకర్ గిరిజన సంప్రదాయమైన గుస్సాడీ నృత్యాల ప్రదర్శన తో ఆహ్వానం పలికారు . ఈ కార్యక్రమంలో రక్షణ బృందం సభ్యులు ఏ సురేష్ , డిజిఎం కిష్ట రామ్ ,జిఎస్ జానకి రామ్, డిజిఎం (ఈఅండ్ ఎం) సత్యనారాయణ్ డిజిఎం సర్వే కె కుమారస్వామి , ఖైర్గుడా ప్రాజెక్టు అధికారి జి మోహన్ రెడ్డి , మేనేజర్ ప్రాజెక్టు ఇంజినీర్ రాజ్ ఎహ్మద్ ,సేఫ్టీ  అధికారి సి హెచ్  వెంకటేశ్వరులు ,యూనియన్ నాయకులు  భాస్కర చార్యులు, ఈశ్వర్ మరియు కార్మికులు పాల్గొన్నారు. 

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26; పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు . బుధవారం మండలములో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు . పులికుంట లో 36 లక్షతో బిటి రోడ్లకు ,పాత పులికుంట 10 లక్షలకు కావర్తులకు , నంబాలలో బిటి రోడ్లకు షాకు స్థాపనలకు భూమి పూజలు చేశారు . అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ఆపరేషన్ గది ప్రారంభించారు . వారు మాట్లాడుతూ మండలములో చెరువులను ఎంతో అభివృద్ధి చేశామని , 3 వ విడతలో మరిన్ని పనులు చేపడతామని పేర్కొన్నారు . రక్షిత మంచి నీటి పథకము  పనులు వేగవంతముగా జరుగుతున్నాయని , ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందిస్తామని , ఇది కేవలం కె సి ఆర్ ఘనత అని పేర్కొన్నారు ,. దళిత బస్తి పేరు మీద పార్హులైన వారికి 3 ఎకరాల భూమిని ఇస్తామని తెలిపారు .  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ ఏ ఎం సి  కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక ,  సర్పంచ్ వెంకటమ్మ, సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,   ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్,  మోడెమ్ సుదర్శన్ గౌడ్,  ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్ తధీతరులు ఉన్నారు.

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి....


                        ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి....
AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్....

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;  కుమురం భీం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిసి రమేష్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏకరూప దుస్తులు విద్యార్థులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పేద విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉండగా నేటి వరకు దుస్తులు ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎంఇవో గా విధులు నిర్వహించిన ఉదయ్ బాబు పర్యవేక్షణ లోపం వలన విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందకుండ పోయాయని అన్నారు.పాఠశాలలో సుమారు 380 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని అన్నారు.  పేద విద్యార్థుల పట్ల మరియు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో డిఇవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్,డివిజన్ కార్యదర్శి సాయి,నాయకులు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్లు సమస్యలను పరీక్షించాలని రాస్తా రోకో

ఆటోడ్రైవర్లు సమస్యలను  పరీక్షించాలని రాస్తా రోకో 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;  ఆటోడ్రైవర్లు తాము సమస్యలను  పరీక్షించాలని బుధవారం రెబ్బెన మండలములోని ప్రధాన రహాదారిపై  రాస్తారోకో నిర్వహించి  అనంతరం తహసీల్ధార్  భండారి రమేష్ గౌడ్ వినతి పత్రాన్ని ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి బోగె  ఉపేందర్ ,ఆటో యూయూనిన్ అధ్యక్షుడు రాజా గౌడ్ లు ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఆటో ఫిట్నెస్ ని ,ఇన్సురెన్సుని పాత పద్దతులునే  కొనసాగించాలని గడువు తేదీ దాటినా తరువాత రోజుకు 50 రూపాయల పెనాల్టీ  రుసుమును, పెరిగిన రుసుమును  తొలగించాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన ఆటో డ్రైవర్లకు 1లక్ష రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు . ఈరోజుల్లో ఆటో నడిపి జీవనం  కొనసాగించడం చాలా కష్టాంగాఉన్న తరంలో ఆటో ల పై పెనాల్టీ రుసుములను విధించడం  తగదన్నారు వెంటనే సమస్యలను పరీక్షించాలన్నారు ఈసందర్బంగా తాహశీల్ధార్ భండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆటో యాజమాన్యుల సమస్యలను పై అధికారుల దృష్టికితీసుకు వెళ్తామని అన్నారు. ఈకాయక్రమంలో   ఏ ఐ టి సి మండల అధ్యక్షుడు  నర్సయ్య, ఆటో యూనియన్ సెక్రెటారి సంతోష్ , లింగమూర్తి ,గోవింద్ , రవికుమార్, విజయ్ , ప్రభాకర్, బాబా ,సాయికిరణ్ ,శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగ ప్రతిజ్ఞ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగ  ప్రతిజ్ఞ 


కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 26;    జాతీయ ఓటర్ దినోత్సవం  సందర్బంగ బుధవారంనాడు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేసారు.ఈ  సందర్బంగ రెబ్బెన మండల తహశీల్ధార్ బి.రమెష్ గౌడ్,ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్,జడ్పీటిసి ఎ.బాబురావులు మాట్లాడుతు  18 సం"రాలు వయసు నిండిన యువతీ యువకులు తమ  ఓటు  హక్కు పొందటానికి విధిగ దరఖాస్తు  చేసుకోవాలని అన్నారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా యువకులు ఓటు హక్కు పొందడానికి ప్రతేకంగా  పోలింగ్ కేంద్రలను  ఏర్పాటు చేయడం జరిగిందని,కేంధ్రాలలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు.పరిసర ప్రాంతాలలో నివాసం వుండే చసదువుకోని ప్రజలు నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహనా కాల్పించి నమోదు చేసుకునేందుకు విద్యార్థులు సహకరించిగలరని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు.ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు.భారత పౌరులమైన మేము,ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో,మన దేశ ప్రజాస్వామ్య సాంప్రాదాయాలను,స్వేచ్చయుత,నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడాతామని,మతం, జాతి,కులం,వర్గం,బాషా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారు ప్రతిజ్ఞ చేశారు.ఎంఎంసీ ఉపాద్యాక్షురాలు కుందారపు శంకరమ్మ,రెబ్బెన సర్పంచ్ పెసారు వెంకటమ్మ,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,కళాశాల ప్రిన్సిపాల్ కర్ల వెంకటేశ్వర్,పాఠశాల హెచ్.ఎం స్వర్ణలత,సర్పంచు లు,ఆధాపకులు,ఉపాధ్యాయులు తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,చిన్న సోమశేఖర్,తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు మిట్ట దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 24 January 2017

ఉత్తమ కార్మికులు ఎంపిక

ఉత్తమ కార్మికులు  ఎంపిక 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ;  ఉత్తమ కార్మికుల ఎంపిక బెల్లంపల్లి ఏరియాలో గన్థత్ర దినోత్సవ పురస్కరించుకొని ఏరియాలోని వివిధ గణీలలోపనిచేసే కార్మికులలో ఉత్తమకార్మికుల ఎంపిక చేయడం జరిగిందని మంగళవారం డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ తెలిపారు ఉత్తమ కార్మికులు టి బలరాజు ఎఎపి ఆపరేటర్ డోర్లి ఓ సి పి  1,కె మల్రెడ్డి జనరల్మజ్జర్, ఎం రాజమోహన్ రావు ఎఎపి ఫిట్టర్ ఖైరగురు ఓసిపి ,ఫై వెంకటేశ్వరరెడ్డి ఎఎపి ఆపరేటర్ ,డి దాస్ ఫిట్టర్ డోర్లి ఓసిపి 2, లక్కాకుల ర్రజేశాము చైర్మన్,బి మల్లయ్య ఈడి ఆపరేటర్ బెల్లంపల్లి ఓసిపి 2 ఎక్ససేటెంషన్  స్ సంపత్ రావులకు  గోలేటి  భీమన్న స్టేడియంలో గణతంత్ర దినోత్సవం రోజున జి యమ రవిశంకర్ చేతుల మీదుగాసన్మానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా ముగ్గుల పోటీలు

జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా ముగ్గుల పోటీలు 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ; రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా మంగళవారం పాఠశాల ఆవరణలో ముగ్గులువేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గుల పోటీల్లో విద్యార్థినిలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాన ఉపాధ్యాయులు డి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి  బాలిక పాఠశాలలో  చేరిక పాఠశాల ప్రగతికి మూలం అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సహౌపాద్యాయులు జె అశోక్, జి కవిత విద్యార్థులు పాల్గొన్నారు 

18 సంవత్సరములు నిండినవారు ఓటు దరఖాస్తు చేసుకోవాలి

18 సంవత్సరములు నిండినవారు ఓటు దరఖాస్తు చేసుకోవాలి 

కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ;  18 సం  రాలు   వయసు  నిండిన  యువతీ యువకులు తమ  ఓటు  హక్కు పొందటానికి దరఖాస్తు  చేసుకోవాలని రెబ్బెన తహిశీల్ దార్  బండారి రమేష్ గౌడ్  పేర్కొన్నారు .  మంగళవారం రెబ్బెన లో  రెబ్బెన  ఆర్ట్స్ మరియు  సైన్సు  కళాశాల  లో   సంజీవిని స్వచ్ఛంద  సంస్థ  ఏర్పాటు చేసిన సమేవేశం లో అయన మాట్లాడినారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా పోలింగ్ కేంద్ర లెవెల్ అధికారులు ఏర్పాటు చేసిన కేంధ్రా  లలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్ ను నమోదు చేస్కోవడం జరుగుతుంది అని అన్నారు. పరిసలా ప్రాంతాలలో నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహనా కాల్పించి నమోదు చేసుకునేందుకు సహకరించిగలరాని కోరారు. ఈ కార్యక్రమం లో కళా శాల ప్రిన్స్ పల్ అమీర్ ఉష్మని మరియు కళాశాల డైరెక్టర్ హరనాథ్,  సంజీవిని స్వచ్ఛంద  సంస్థ సభ్యులు దికొండ సంజీవ్ కుమార్, కె సునీల్ కుమార్, సాయితేజ, సాయి విద్యార్థులు కాళాశాల బృందం పాల్గున్నారు.

Monday, 23 January 2017

ట్రాఫిక్ నియమాలు పాటించడం మన అందరి బాద్యత- జిల్లా ఎస్పీ సన్ ప్రీతి సింగ్

ట్రాఫిక్ నియమాలు పాటించడం మన అందరి బాద్యత- జిల్లా  ఎస్పీ సన్ ప్రీతి సింగ్


 కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ;  రోడ్డు భద్రత వారోత్సవాల చివరి రోజూ జిల్లా వ్యాప్తముగ  పోలిసులు  ప్లకార్డులను ప్రదర్శిస్తూ  స్కూలు విద్యార్థులతో  ర్యాలి  మరియు ప్రదాన కూడళ్లలో    మానవహారం నిర్వహించారు. ఈ రొజు జిల్లా  ఎస్పీ గారు కగజనగర్ లో జరిగిన బహుమతుల ప్రధాన  కార్యక్రమములో పాల్గోన్నారు. గత వారము రోజుల నుండి జిల్లాలో ఎస్పీ గారి ఆదేశానుసారం   ప్రతి పొలిసు స్టేషను పరిథిలో పలు రకలా రోడ్డు భద్రత అవగహన సదస్సులు ర్యాలీలు మరియు యువతను ట్రాఫిక్ మిత్ర     అనే పేరుతో   స్వయంగా ట్రాఫిక్ రేగులషెన్ లో పాల్గొన్నారు.  ఆటో డ్రైవర్లకు కంటి పరిక్షలు చేయించడం  జరిగింది ఇందులో భాగంగానే ఈ నెల 20 తేదీన రోడ్డు భద్రత  పై  జిల్లా మొత్తంగా స్కూలు పిల్లల తో పెయింటింగ్ మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. వీరిలో పెయింటింగ్ లలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి  వారికి ప్రధమ ద్వితియ మరియు తృతీయ  బహుమతులు అదేవిదంగా వ్యాస రచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 3000/ లు ద్వితీయ బహుమతి కి 2000/_ లు, తృతీయ బహుమతి కి 1000/_ లు చొప్పున రెండు పోటీలలో గెలుపొందిన వారికి అందజేశారు వీరిలో పెయింటింగ్ లో ఉత్తమ  చిత్రలేఖనం    గీసిన జులేఖకు   వివేకనంద జానియర్ కాలేజ్ కగజనగర్ కు  ప్రథమ బహుమతి   కౌశిక్ షింగ్ వివేకానంద జూనియర్   కాలేజ్  ద్వితీయ బహుమతి,     పి స్వప్న తృతియ బహుమతులు   జిల్ల ఎస్పీ గారు అందజేశారు. అదేవిధంగా వ్యాసరచన పోటీలో ముక్క సాయి కిరణ్ సరస్వతి శిశుమందిర్ కు ప్రధమ బహుమతి, ప్రియంకా కు ద్వితియ బహుమతి, ఎన్ నర్మదా కు తృతీయ బహుమతి ఇంగ్లీష్ వ్యాస రచన పోటిలో తన్వీర్ ఫాతిమా ఫాతిమ కాన్వెంట్ హై స్కూలు  నగదు బహుమతి గెలుచుకున్నారు.ఈ సందర్బముగా జిల్ల ఎస్పీ సన్ ప్రీతి సింగ్ మాట్లడుతూ జిల్లా పోలిసులు గత వారం రోజులుగా ప్రజలతో మమేకమై వారి వారి పరిధిలలో అనేక కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్య పరిచారని ప్రజలు కుడా పోలిసులకు సహకరించారని అభినందించారు.ప్రజలు తమ వాహనాలను ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ మరియు  సీట్  బెల్ట్ దరించి  వాహనాలను నడపాలని, ముఖ్యముగా  యువత మద్యం సేవించి సెల్ ఫొన్ మాట్లడుతూ వాహనాలను నడపరాదని  రాష్ డ్రైవింగ్ చెయ్యకూడదని  యువత సన్మార్గములో  నడిచి  భవిశ్యత్తులో మంచి   ఉన్నత స్థానానికి ఎదగాలని  ఆయన  చెప్పారు ప్రజలు ప్రమాదాలకు గురి అయ్యి తమ కుటుంబ సభ్యులకు శోకం మిగిల్చ కూడదని కొరారు. ఇక పై ట్రాఫిక్ నియమాలను అతిక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు ప్రతి వ్వక్తి ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కల్గి ఉండాలని సమాజం   పట్ల బాధ్యత యుతముగా వ్యవహరించాలని అయన కొరారు. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ డిఎస్పీ కాగజనగర్ హబీబీఖాన్ టౌన్ సీఐ నాగేందర్, ఆటో డ్రైవర్లు, నవోదయ విద్యాలయం స్కూలు విద్యార్థులు ఇతర ప్రజల పాల్గొన్నారు. 

కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలి ఎం ఆర్ ఓ

కొత్తగా ఓటరు నమోదు  చేసుకోవాలి  ఎం ఆర్ ఓ

 కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ; ఓటర్ లిస్టులో పేరు లేనివారు ,కొత్తగా మార్పులు చేసుకొనే వారు వెంటనే నమోదు చేసుకోవాలని రెబ్బెన తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ అన్నారు . సోమవారం ఏర్పర్చిన సమావేశములో మాట్లాడారు . జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా పేరు నమోదు చేసుకొనే వారు ఆధార్ కార్డు 2 ఫొటోలు రావాలని తెలిపారు . 6 7 8 ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు . ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.

హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలి ; సి ఐ మదన్ లాల్

హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలి ; సి ఐ మదన్ లాల్ 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 : రెబ్బెన ; 28వ రోడ్డు  భద్రత వారోత్సవాల సందర్బంగా రెబ్బన పోలీస్ వారి అధ్వర్యం   విద్యార్థిలచే ప్రధాన రహదారి మీద సోమవారం  ప్రత్యేక ర్యాలీ నిర్వహంచారు. సి ఐ మదన్ లాల్ మాట్లాడుతూ హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించి ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు.   వాహన పాత్రలతోపాటు హెల్మెట్ మరియు సిట్ బెల్ట్స్ ని ధరించి ప్రమాదాలు జరిగినప్పుడు విలువైన ప్రాణాలు కాపాడుకోవలన్నారు. ఈ సందర్భంగా పలువరు వాహనదారులకీ తగు భద్రతా నియమాలను వారికీ వివరించారు. ఈ ర్యాలీలో విద్యార్థిలు హెల్మెట్ ని ధరించి రోడ్ భద్రత నియమాలను పాటిస్తూ , తమ ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు .     ఎస్ ఐ సురేష్ , విద్యార్థులు , తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

విద్యార్థుల సమస్యలను తీర్చాలి ----- ఏ ఐ ఎస్ ఎఫ్

విద్యార్థుల సమస్యలను తీర్చాలి  ----- ఏ ఐ ఎస్ ఎఫ్ 


కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 23 ; విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను తార్చలని ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేణు అన్నారు  . అఖిల భారత విద్యార్థి సామెఖ్య , ఏ ఐ  వై ఎఫ్ ఆధ్వర్యములో బస్సు జాతా భాగములో రెబ్బెనలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్విర్యం చేయడానికి  కుట్రను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగం  ప్రకారం విద్య ప్రాథమిక హక్కు గా ఉన్న అలంటి విద్యను సంపన్నులకు  పరిమితమయ్యేలా చేస్తున్నాయి అని,  విద్య నిరుపేద ,  బలహీన వర్గల వారికీ అందకుండా పోతుందన్నారు. ప్రభుత్వం  కార్పొరేటు ప్రవైట్ విద్య సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ప్రాంతాల్లో మూసి వేస్తూ ఉన్న వాటిల్లో మౌలిక సదుపాయాలు లేకుండా, ఉపాధ్యా ల పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా అర కొర ఉపధ్యాలతో భోధన చేయిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫై చిన్న చూపు చూస్తూ వ్యవహరిస్తున్నారని అన్నారు, ఇలాంటి వ్యవస్థ ని దూరం చేసే వరకు ఏ ఐ  ఎస్ ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూ తమా  హక్కుల సాధనకై విద్యార్థుల పట్ల ఉంటుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి  విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు, ఈ సమావేశంలో ఏ ఐ సెస్ ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శంకర్ , అధ్యక్షులు రాములు , కార్యదర్శి అనిల్,  ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులూ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్,  డివిజన్ కార్యదర్శి పుదారు సాయి, ఎం భాస్కర్, ,కస్తూరి రవి, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ , సి పి ఐ మండల కార్యదర్శి జాడి తిరుపతి , రాయిలా నర్సయ్య , లతో పాటు ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య ,ఉన్నారు .   నాయకులూ పాల్గొన్నారు.

Saturday, 21 January 2017

స్మశాన వాటిక సాధన సమితి ఆధ్వర్యం లో కొనసాగుతున్న ద్దీక్షలు


స్మశాన వాటిక సాధన సమితి ఆధ్వర్యం లో కొనసాగుతున్న ద్దీక్షలు 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 : జిల్లా కేంద్రం ఐన ఆసిఫాబాద్ లో హింధుల కోసం స్మశాన వాటికలు స్థలము కేటాయించాలని శ్మశానవాటిక సాధన కమిటీ చేపట్టిన ధీక్షలో   శనివారానికి 13 వ రోజుకు చేరుకోన్నాయి ఈ ధీక్షల్లో అన్ని కులాల వారు మరియు పార్టీలకు అతితంగా ద్దీక్షలు కొనసాగిస్తున్నాం అన్నారు . ఐన ఇప్పటి వరకు ఎలాంటి చలనం రాలేదన్నారు . ఎలాంటి భూసేకరణలో సర్వే నిర్వహించి స్థలం కేటాయించాలని డిమాండ్ చేసారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించడం అందరి బాద్యత- జిల్ల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

రోడ్డు భద్రత నియమాలు పాటించడం అందరి బాద్యత- జిల్ల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 :  28 వ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం  జిల్లా ఎస్పీసన్ ప్రీత్ సింగ్ ఆదేశాలనుసారం జిల్లా పోలిసులు తమ తమ స్టేషను పరిధులలో ప్రతి వాహనం వెనుకాల ఎరుపు రంగు  రేడియం  స్టికేర్స్ లెని వాహనాలను గుర్తించి అప్పటికప్పుడు రేడియం స్టిక్కర్స్ అతికించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తమ వాహనాల వెనుకల రేడియం స్టికర్లు పెట్టాలని తద్వారా రాత్రి వేళలో వాహనాన్ని గుర్తించి ప్రమాదాలను అరికట్ట వచ్చునని వాహన దారులకు అవగహన కల్పించారు.అదేవిదంగా హెల్మెట్ లెని వారికి అప్పటికప్పుడు హెల్మెట్ కొని ఇప్పించేలా ప్రతి పొలిసు స్టేషను పరిథిలో హెల్మెట్ సెల్లెర్స్ లను ఎర్పాటు చేశారు అంతేకాకుండా  హెల్మెట్ ధరించి వచ్చే వాహన దారులకు పోలిసులు పువ్వులను ఇస్తూ  వారిని ప్రోత్సహించారు. హెల్మెట్ లెకుండా కొనకుండా ఉన్నవారికి జరిమానా విధించారు.ఈ సందర్బముగా ఎస్పీ మాట్లడుతూ జిల్లా వ్యాప్తముగా  ఈ రోజూ  పోలీసులు హెల్మెట్ మరియు రేడియం స్టిక్కర్లు మీద ప్రజలకు అవగహన కల్పిస్తున్నారని ప్రజలు కుడా పోలిసులకు సహకరించాలని తమ అమూల్యమైన ప్రాణాలను రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అందరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కొరారు.

హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలి ; సి ఐ మదన్ లాల్

హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలి ; సి ఐ మదన్ లాల్ 



కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 : రెబ్బెన ;  హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించి ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని సి ఐ మదన్ లాల్ అన్నారు శనివారం రెబ్బెన రహదారిపై భద్రత వారోత్సవాల సందర్బంగా ప్రత్యేక వాహనా తనిఖీని నిర్వహించారు. వాహనం వెనుకాల ఎరుపు రంగు  రేడియం  స్టికేర్స్ లెని వాహనాలను గుర్తించి అప్పటికప్పుడు రేడియం స్టిక్కర్స్  ను అతికించరు. హెల్మెట్ లెని వారికి అప్పటికప్పుడు హెల్మెట్ కొని ఇప్పించేరు. ఈ తనిఖీలో అన్ని పత్రాలు ఉండి హెల్మెట్ ధరించిన వారికీ చిన్న పిల్లలతో రోజా పూలను ఇచ్చి అభినందించారు . సి ఐ మదన్ లాల్ మాట్లాడుతూ వాహన పాత్రలతోపాటు హెల్మెట్ మరియు సిట్ బెల్ట్స్ ని ధరించి ప్రమాదాలు జరిగినప్పుడు విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు వీరితోపాటు ఎస్ ఐ సురేష్ ,తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.  

పనికి ఫలితం ఏది ..... ? ఐకెపి వి ఓ ఏ లు

పనికి ఫలితం ఏది ..... ? ఐకెపి వి ఓ ఏ లు  


కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 21 :  ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన  పథకాలను  మహిళా సంఘాల కు  చేరవేయడం లో ఐకెపి విఓఏ లు ప్రముఖపాత్ర వహిస్తూ  గత 15 సంవత్సరాలనుంచి వెట్టి చాకిరీ చేస్తున్న వేతనాలు ఇవ్వకుండా పనికి తగ్గ ఫలితం లేదని విఓఏ ల జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి భేమేష్ అన్నారు . రెబ్బెన  లో గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృతకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందచేశారు. అనంతరం  విఓఏ ల జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి భేమేష్ మాట్లాడుతూ మహిళ  స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ,స్త్రీనిధి ఋణం ,పిఒపి రుణాలు ,అభయహస్తం ,ఆమ్ ఆద్మీ భీమా యోజన ,జనశ్రీ భీమా యోజన ,ఇన్సూరెన్స్ ల  తో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలను విజయవంతం చేయడం లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నామని  అన్నారు . ప్రభుత్వం ఎన్నికల ముందు  ఐకెపి విఓఏ లకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కానీ ఇంతవరకు నెరవేర్చకుండా జీతభత్యాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృత మాట్లాడుతూ విఓఏ లు  లేకపోతే స్వయం సహాయక సంఘాలు పని చేయవని,విఓఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు అలాగే విఓఏ సమస్యలను జిల్లా సమాఖ్య దృష్టికి తీసుకెళ్తామన్నారు . ఈ సమావేశం లో ఏపీఎం వెంకటరమణ , జిల్లా ఉపాధ్యక్షులు డోంగ్రి తిరుపతి ,మండల ఉపాధ్యక్షులు మెర్లే తిరుపతి ,మండల  కార్యదర్శి శ్రీకాంత్,లింగన్న,కృష్ణ, సులోచన ,శంకర్ ,రవి తదితర విఓఏ లు పాల్గొన్నారు

Friday, 20 January 2017

బైకులు ఢీ ; తీవ్ర గాయాలు

 బైకులు ఢీ ;  తీవ్ర గాయాలు

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బెన మండలం గంగపూర్ లో ఎదురు ఎదురుగా బైకులు ఢీకొన్నాయి.  రెబ్బెన కు చెందిన సురేష్ కుమార్  కి తీవ్ర గాయాలు అయ్యాయిని  వెంటనే  స్థానికులు108 వాహనం లో మంచిర్యాల అసుపత్రీకి తరలించారని స్థానికులు తెలిపారు. 

18సం నిండిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలి


18సం నిండిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలి 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 20 : రెబ్బెన ; జనవరి 25న  అంతర్జాతీయ ఓటర్  దినోత్సవం సందర్బంగా శుక్రవారం  రెబెనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన మరియు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి విద్యార్థులలో ఓటర్ నమోదు, పోలింగు నమోదు  పలు కార్యక్రమాలపై తహసీల్దార్ రమేష్ గౌడ్  అవగాహనా  కల్పించారు. 18సం నిండిన వారు ఈ నెల 25న  అంతర్జాతీయ  ఓటర్ దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెమ్ స్వర్ణ లత, తదితర విద్యార్థులు ఉపధ్యాలు ఉన్నారు.