రెబ్బెన : రెబ్బెన మండలానికి చెందిన ఆయిళ్ల సాయి విద్యుత్ షాక్ తగలడంతో పొట్ట, నడుము మీద గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి 7.30 సమయంలో సాయి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా సబ్‌స్టేషన్ నుండి 11 కె.వి. కరెంటు తీగలు ఫంక్షన్ హాల్ ఏరియాలో విద్యుత్ ఘాతానికి గురై ఒళ్ళు కాలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విద్యార్థి అసిఫాబాద్ చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సాయి తల్లిదండ్రులు తెలిపారు. విద్యుత్ ఘాతానికి గురైన సాయిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మండలంలో గత నెలలో విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలు పాలైయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంతమంది ప్రాణాలను బలికొంటారని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పంది ంచి ఇకనైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 31 July 2015
విద్యుత్ ఘాతానికి విద్యార్థికి గాయాలు
రెబ్బెన : రెబ్బెన మండలానికి చెందిన ఆయిళ్ల సాయి విద్యుత్ షాక్ తగలడంతో పొట్ట, నడుము మీద గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి 7.30 సమయంలో సాయి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా సబ్‌స్టేషన్ నుండి 11 కె.వి. కరెంటు తీగలు ఫంక్షన్ హాల్ ఏరియాలో విద్యుత్ ఘాతానికి గురై ఒళ్ళు కాలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విద్యార్థి అసిఫాబాద్ చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సాయి తల్లిదండ్రులు తెలిపారు. విద్యుత్ ఘాతానికి గురైన సాయిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మండలంలో గత నెలలో విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలు పాలైయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంతమంది ప్రాణాలను బలికొంటారని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పంది ంచి ఇకనైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కళాశాలలో టీవీవీ నూతన కమిటీ ఏర్పాటు
శుక్రవారం టీవీ వీ మండల క న్వీనర్ పర్వతి సాయి మరియు డివిజన్ నాయకలు సాయినవతేజ ఆధ్వర్యంలో రె బ్బెనలోని ప్రభుత్వ కళాశాలలో నూతన కమిటీని ఎన్నికచేశారు. అధ్యక్షులుగా వెంకటేశ్ , ఉపాధ్యాక్షులుగా రాకేష్, గొలి హరీష్, ప్రధాన కారదర్శిగా పవణ్ కళ్యాణ్, సహాయ కార్యదర్శులుగా జె. సాయికృష్ణ, జి. సాయి, కోసాధికారిగా సతీష్, కార్యవర్గ సభ్యునిగా హరీష్, వంశీ, భాస్కర్, మహేష్ ఎన్నికయ్యారు.
జీపీ కార్మికుల నిరసన,ఎన్‌ఎస్‌యూఐ మద్ధ తు
రెబ్బెన : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెలో శుక్రవారంకి 31 రోజు కావడం వలన మట్టితింటూ నిరసన తెలిపారు.కార్మికులకు మద్ధతుగా ఎన్‌ఎస్‌యూఐ జిల్ల్లా ప్రాథన కార్యదరి ్శ దుర్గం భరద్వజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తమ మద్ధతు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో అనేక అందోళనలు ఫలితంగా ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఉద్యోగాలను ఫర్మినెంట్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ అబ్బు, ఎన్‌ఎస్ యూఐ మండలకార్యదర్శి ఆర్. సంజీవ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మూజ్జ, సాయివికాస్, తోట సాయి, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జీ. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు డి. తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్ పాల్గొన్నారు.
నంబాల గ్రామపంచాయతీలో హరితహారం
రెెబ్బెన మండలంలోని నంబాల గ్రామపంచాయతీ సర్పంచ్ గజ్జల సుశీల మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలోని ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, సింగిల్ విండో డైరెక్టర్ సత్తయ్య, సాక్షర భారత కోఆర్డినేటర్ సాయిబాబా, రేషన్ డీలర్ జానకిరాం, అంగనవాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆగష్టు 3నుంచి యోగ శిబిరం
మండలంలోని గోలేటి టౌన్ షిప్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైజీఎన్ పర్శనల్ బెల్లంపల్లి జె. చిట్టరంజన్ కుమార్ మాట్లాడుతూ మే నెలలో ఏర్పాటు చేసిన యోగ శిబిరానికి టౌన్ షిప్‌లోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని ఆగస్టు 3 నుండి మూడు నెలలపాటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యోగ వలన అందరి ఆరోగ్యం బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని టౌన్ షిప్‌లోని కార్మికులు , ప్రజలు పాల్గొనాలని తెలిపారు.
ప్రభుత్వ వసతీ గృహాల పాఠశాలలు సర్వే....తెలంగాణ వి ద్యార్థి వేధిక
తెలంగాణ విద్యార్థి వేధిక ఆధ్వర్యంలో రెబ్బెన మండల ంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో టీవీవీ అధ్యక్షుడు కడకల సాయి మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 6వతేది వరకు జిల్లాలోని పాఠశాలలు మరియు ప్రభుత్వ వసతీ గృహాల సర్వేలో జిల్లాలోని టీవీ వీ నాయకులు అందరూ పాల్గొన్నాలని తె లిపారు. ఈ సమావేశంలో టీవీవీ జిల్లా కార్యదర్శి జరుకుల శివాజీ,టీవీవీ నాయకులు పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ
రెబ్బెన : మండలంలోని ప్రధాన రహదారిమీద పోలీసు స్టేషన్ ముందు వాహనాలను తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహదారులకు పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
రెబ్బెన మండలంలో గురుపౌర్ణమి సందర్భంగా దుర్గ మాతా మందిరంలో గల సాయి బాబా విగ్రహానికి పాలాభిషేకం చేసి, భక్తి శద్రలతో పూజలను నిర్వహించారు.
ఏరియాలో పరిశీలించిన పర్సనల్ సివిల్ జీ.ఎం. రామభద్రిరాజు
రెబ్బెన మండలంలోని గోలెటి టౌన్‌షిఫ్‌లో కార్మికుల కాలనీలను టౌన్‌షిఫ్ అమలులో ఉన్న పనులను గోలెటి క్రాస్ రోడ్డు వద్ద గల కొత్తగా నిర్మాణంలో ఉన్న సీ.హెచ్.పీ., టౌన్‌షిప్‌లో గల అన్ని రోడ్లను, డ్రైనేజీలను, పరిశీలించారు. పర్సనల్ సివిల్ జీఎం రామభద్రిరాజ్‌తోపాటు, జీఎం రవిశంకర్, ఎవైజీఎం పద్మశ్రీ, డివైవీఎం సివిల్ రామక్రిష్ణ, రాజేంద్ర్‌ప్రసాద్ పాల్గొన్నారు
నట్టల మం దు పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీలు
రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో గోలేటికైర్ గూడలో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఇందులో గొర్రెలు 247, మేకలు 1008. కార్యక్రమం జడ్పీటీసీ బాబురావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మురళీబాయ్ , సురేందర్ రాజు , సర్పంచ్ తోట లక్ష్మణ్, డాక్టర్ సాగర్, సిబ్బంది బిక్కు, వెం కటేష్, తదితరులు పాల్గొన్నారు.
Thursday, 30 July 2015
కార్మికుల కష్టాలను గుర్తించాలి-వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్
మరుపురాని వ్యక్తికి ఎస్వీ విద్యార్థుల ఘన నివాళి
రెబ్బన మండలంలోని ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాటశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం కు బుదవారం ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా పాటశాల కరస్పందేంట్ డి. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎ పీ జె అబ్దుల్ కలాం మరణం యావత్ ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు. అతని సేవలు మరవలేనివని, ప్రతి ఒక్కరు తన ఆశయాలను అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని అన్నారు .
మోచేతులపై కూర్చొని వినూత్న నిరసన
మహా మనిషికి అశ్రునివాలి
రెబ్బెన లోని విశ్వ శాంతి విద్యాలయంలో ఎన్,ఎస్,యు,ఐ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ మాట్లాడుతూ ఆయన మిసేల్ మాన్ , భారతరత్న అవార్డు గ్రహిత అబ్దుల్ కలాం తిరిగిరాని లోకాలకు వెళ్ళడం భారతదేశానికి తీరని లోటు అన్నారు, ఆయన కోసం అందరు 2 నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈ,పోచయ్య, ఎన్,ఎస్,యు,ఐ నాయకులు సాయి వికాస్,ముజ్జ,వినయ్,సంజు,అమీత్,కిషోర్, రమేష్ తదీతరులు పాల్గొన్నారు.
కార్మిక వాడల్లో మురుగు
ఎంఆర్‌సీ కార్యాలయంలో హరితహారం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా రెబ్బెన మండలం రిసోర్స్ సెంటర్‌లో జెడ్పీటీసీ బాబురావు ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అడువుల జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్‌లో మరింత పచ్చదనంగా మారాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజకుమార్, ఎంపీపీ సంజీవ్, వైస్ ఎంపీపీ గొడిసెలరేణుక, సర్పంచ్ పెసరు వెంకట మ్మ, ఎంఈవో మహేశ్వరెడ్డి పాల్గొన్నారు.
ఉరి వేసుకుని పారిశుద్ధ్య కార్మికులు నిరసన
మండలంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా గురువారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉరి వేసుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలో మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్ మాట్లాడుతూ.. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఉరి వేసుకునే పరిస్థితి వస్తుందని కనీస వేతనాలను పెంచాలని అన్నారు. ఈ నిరసనలో మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు తిరుపతి, లక్ష్మి, రాజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు.
అమరుడు అబ్దుల్ కలాం...ఎమ్మార్వో
మండలంలోని తహసీల్దార్ కార్యాలయంల అమరుడైన మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీతగా ప్రజలు గుండెల్లో తనదైన ముద్రను చిరస్మరణీయంగా ఉండేలా రెబ్బెన మండల తహసీల్దార్ రమేష్‌బాబు అన్నారు. ఆయన మరణానికి ఘనంగా నివాళులు అర్పించీ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలొఎంఈవో మహేశ్వరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జగన్‌మోహన్ రావు, రెబ్బెన్ ఎంపీపీ సంజీవ్, ఏపీఎం రాజకుమార్, జె డ్పీటీసీ ఎ. బాబురావు, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, గంగాపూర్ సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 28 July 2015
మోచేతులపై కూర్చొని వినూత్న నిరసన
కార్మిక వాడల్లో మరుగుతున్న మురుగు
రెబ్బన మండలం లోని సింగరేణి కార్మిక వాడల్లో ఉన్న డ్రేనేజి కాలువలు అపరిశుబ్రంగా మరి పిల్లలు వృద్దులు రోగాలభారిన పడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. గత కొంత కాలంగా జనావాసాల్లో ఉన్న సివిల్ కార్యాలయం పక్కనే డ్రినేజి నిల్వ ఉండడం తో మురుగు నిల్వతో దుర్గంధం వ్యాపించి అనారోగ్యాల పాలవుతున్న మని కార్మిక కుటుంభాలు చెబుతున్నారు . ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.
ఎ.పి.జె అబ్దుల్ కలాం మృతి పట్ల జీపీ కార్మికుల ఘన నివాళి
ఎ.పి.జె కు... జి పి కార్మికుల ఘన నివాళి
రెబ్బెన:గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం ఉదయం మాజీ రాష్ట్రపతికి నివాళులు అర్పించారు. 11వరాష్ట్రపతిగా సేవలందించి, అణు రంగంలోని శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలందించిన
మిసేల్ మాన్ , భారతరత్న అవార్డు గ్రహిత అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మృతిచెందారని మన అందరికి విదితమే అని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ అన్నారు. సమ్మె లో ఉన్నటువంటి గ్రామ పంచాయితి కార్మికుకులు ఆయన చిత్రపటానికి పూలమాలలతో శ్రద్దాంజలి ఘటించి, అనంతరం ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘo జిల్లా ఉపాధ్యక్షుడు
బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు డి.తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, లక్ష్మి, రాజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు
Monday, 27 July 2015
అసభ్యపదాజాలంతో దూసించిన వ్యక్తిపై కేసు
రెబ్బెన: మండలం గోలేటి టౌన్‌షిప్ పోటు శ్రీదర్ రెడ్డి పై అసభ్య పదాజాలంతో దూసిం చిన అజిమిరి రమేష్‌పై సోమవారం కేసు నమోదుకున్నట్లు రెబ్బన ఎస్సై హనుక్ తెలిపారు. ఆదివారం రాత్రి గోలేటి క్రాస్‌రోడ్డు వద్ద ధాబా హోటల్‌లో వీరిద్దరు భోజనం చేస్తుండగా గొడవ చోటుచేసుకుంది. పాతకక్ష్యలతో శ్రీదర్‌రెడ్డిని అసభ్యపదాజాలతో దూషించి అతనిపై టేబుల్ తోసేసి గొడవ జరిగిం దని శ్రీదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రెబ్బెన ఎస్సై తెలిపారు
పశువైద్య శిభిరం
రెబ్బెన: మండలంలోని తుంగెడ, పోతేపల్లిలో డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పశువైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. అదే విదంగా రేపు మంగళవారం పాసీగాం, వరదలగూడ, గంగాపూర్ గ్రమాలలో పశువైద్య శిభిరాన్ని నిర్వహించనున్నట్లు రెబ్బెన పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు.
మౌళిక వసతుల కోసం తహసీల్ధార్‌కు వినతిపత్రం
రెబ్బెన: మండలంలోని సోమవారం తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల శివాజీ రెబ్బెన మండల తహసీల్ధార్‌కు వినతిపత్రం ఇచ్చారు. శివాజీ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌళిక వసతులు లేవని లైబ్రరీ, ల్యాబ్‌లు అసౌకర్యంగా ఉన్నాయని అన్నారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ పార్వతిసాయి కిరణ్, వెంకటేష్, తదితరులు వినతిపత్రాన్ని ఇచ్చారు.
27వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె
రెబె ్బన: మండలంలో పారిశుద్ధ్య, గ్రామ పంచాయతీ కార్మికుల నిరవదిక సమ్మె 27వ రోజుకు చేరిందని మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని లేని ఎడల నిరవధిక సమ్మెలో అనేక ఆందోళనలు చేపడుతామని అన్నారు. ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు బాబాజీ, మండల అధ్యక్షులు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యులు తిరుపతి, నాయకులు అన్నాజీ, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Sunday, 26 July 2015
కూరగాయలు అమ్ముతూ జీపీ కార్మికుల నిరసన
కూరగాయలు అమ్ముతూ జీపీ కార్మికుల నిరసన
రెబ్బెన : గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. కార్మికులు రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెబ్బెన లో ఆదివారం కూరగాయలు అమ్ముతూ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు డి.తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, కార్మికులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలు స్వాధీనం
రెబ్బెన : బొగ్గు లారీలో అక్రమంగా తరలిస్తున్న 32 టేకు దుంగలను రెబ్బెన మండల ంలోని గోలేటి శివారులో ఆదివారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. టేకు దుంగలు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్న బీట్ అధికారి ఎండీ షరీఫ్ అడ్డుకోగా ఆయనపై దాడి చేసి స్మగ్లర్లు పారిపోయారని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. నిందితులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని, సింగరేణి వారికి కూడా నోటీసులు పంపిస్తామన్నారు. కలపతో కూడిన బోగ్గు లారీని సీజ్ చేశారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌వో హనుమం తరావు, సెక్షన్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, డీవైఆర్వో కె. శ్రీనివాస్, బీట్ అధికారులు ఎండీ అజరుద్దీన్, లత, రవి పాల్గొన్నారు.
Saturday, 25 July 2015
గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక సమ్మె
రెబ్బెన;గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక సమ్మెశనివారంనికి రెబ్బెన మండలంలో 25 రోజుకు చేరింది. కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని 25 రోజులు అయిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు
కార్మికుల కష్టాలను గుర్తించాలి-వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్
ముప్పు రైతులను ఆదుకోని చెరువు నిర్మాణం చేపట్టాలి
రెబ్బెన: నంబాల,నారాయణ పుర్ శివారులో గల మిషన్ కాకతీయ పనులు పకీరుపల్లె చింతలచెరువు కి ంద ముప్పు రైతులను ఆదుకోని చెరువు పనులను చేపట్టాలని శుక్రవారం నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్ ఆధ్వర ్యంలో రైతులు తహసీల్దార్ రమేష్ గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ చెరువు నిర్మాణం చేప డితే పది ఎకరాలు సాగుకు వస్తుందని కాని డ భై ఎకరాల సాగు భూమి ముప్పుకు గురౌతుందని మూప్పై మంది రైతులు రోడ్డున పడతారని ఎంపీటీసీ కొవ్వూరు శ్రీనివాస్ అన్నారు. ఎంఆర్వో మాట్లాడుతూ సంబంధింత అధికారులతో సర్వే చేపించి కలెక్టర్‌గారికి రీపోర్టు పంపిస్తామని అన్నారు. ఈ వినతి పత్రాన్ని ఎంపీటీసీతో పాటు రైతులు చిట్ల శంకర్, జాడి రాజయ్య, పిరిసింగుల శంకరయ్య, బీమయ్య, సత్యనారాయణ, మిగిలిన రైతులంతా కలిసి ఇచ్చారు
బట్టాలు ఉతుకుతూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన
రె బ్బెన : పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారంకి 24వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు బట్టలు ఉతుకుతూ నిరసన తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాశ్, డివిజన్ కమిటీ సభ్యుడు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, నాయకులు అన్నాజీ,సత్యనారాయణ, భాస్కర్, రాజమ్మ, లక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు, సమ్మెకు
పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
రెబ్బెన మండలంలోని పలు వీధుల్లో పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఒక వైపు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ వారి మాటలను పెడచెవిన పెడుతున్నారడనడానికి ఇదే నిదర్శనం. పట్టణంలోని వీధిదీపాలు దినంలో కూడా వెలుగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రాత్రుల్లో వీధి దీపాలు వేసి తెల్లవారిన తర్వాత వాటిని ఆఫ్ చేయాలన్న కనీస ఆలోచన సంబంధిత అధికారులకు లేదు రెబ్బెన్ గ్రామపంచాయితీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వలన వేసిన దీపాలు వేసినట్లే ఉన్నాయని గ్రామ ప్రజలు ఆరోపించారు
Friday, 24 July 2015
ఆంధకారంలో గ్రామాలు
రెబ్బెన : గత మూడు రోజులు నుండి విద్యుత్ సరఫరా లేక గ్రామాలు అంధకారంతో మగ్గుతున్నాయి. రాత్రిపూట చిన్నపిల్లలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షకాలం కావడం వల్లా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల మురికి కాలువులల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు విఫరీతంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురౌతున్నామని రెబ్బెన్ మండలంలోని నంబాల,కిష్టాపుర్, జక్కులపల్లి, నారాయణపుర్, గంగాపుర్ గ్రామపంచాయితీల్లో విద్యుత్ సప్లై లేదని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
విద్యారంగ సమస్యలు పరిస్కరించాలి
రెబ్బెన : మండలంలోని గురువారం బీ సీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ విద్యార్థిక వేదిక కార్యవర్గ సభ్యుడు బి. రాహుల్ ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యను రద్దు చేసి కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని జీవో నెంబర్ 27 రద్దు చేయాలని అడవులపై ఆదివాసులకు హక్కుల కల్పించాలని, ఆసీఫాబాద్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీవీవీ తూర్పు జిల్లా అధ్యక్షుడు కడతల సాయి , నాయకులు రవీందర్ , విజయ్,శ్రీనివాస్,గణష్ తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థిణికి ఆర్థికంగా చేయూత
రెబ్బెన : మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రే స్వప్న అనే విద్యార్థిని ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించి నాగపూర్ ఏఎన్‌ఐఐటీలో సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న స్వప్నకు రెబ్బెన్ తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు రూ.5,500 అందరూ కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా త హసీల్దార్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు చదువు కోవడానికి తమ వంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ప్యూటీ తహసీల్దార్ రామోహన్ రావు తదితర సిబ్బంది కార్యసిబ్బంది పాల్గొన్నారు.
Thursday, 23 July 2015
పాఠశాల సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థినులకు అవగాహన
23వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె,మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
రె బ్బెన : పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారానికి 23వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు ఆవుకు వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స మర్పించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాశ్, డివిజన్ కమిటీ సభ్యుడు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, నాయకులు అన్నాజీ,సత్యనారాయణ, భాస్కర్, రాజమ్మ, లక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు, సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడు రుద్రరావు రాంచందర్ మాదిగా , ఎంహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు ర జియెందర్ , బీసీ నాయకులు ఎస్. చంద్రకుమార్ అడ్వకేట్, పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ పంచాయతీకార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు అన్నారు. సీఎం కేసీఆర్ వారిపట్ల చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. సమస్యలు తీరే వరకు వారికి మద్దతునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 22 July 2015
సింగరేణిలో క్రీడలకు అధిక ప్రధాన్యత
రెబ్బెన : సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకలతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో 30 వేణుగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి క్రికేట్ పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మిక క్షేత్రంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ పాటవాలు కనబర్చే క్రీడాకారులకు కొదువ లేదని వారిని ప్రోత్సహిస్తే క్రీడారంగంతో అద్బుతాలు చేస్తాన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు రాష్ట్ర వ్యాస్తంగా 8 జట్లు పాల్గొన్నాయి. ఈప్రారంభ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం, డివైజిఎం చిత్తరంజన్ కుమార్ పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, స్పోట్స్ సూపర్ వైజర్ రమేష్, సీనియర్ క్రీడా కారులు పాల్గొన్నారు.
ఎరువుల తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్
రెబ్బెన : మండలంలోని సహకారబ్యాంకు ఎరువులను సబ్ కలెక్టర్ రాంజీవ్ గాంధీ హన్మంతు బుధవారం తనీఖీ నిర్వహించారు. రైతులు ఎరువులు సక్రమంగా అందడంలేదని ఆందోళన చేయగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ మంజుల, ఎడీఎ శ్రీనివాస్, ఏఈఓ మార్క్, సొసైటీ చైర్మన్ గాజుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గొన్నారు
మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
రెబ్బెన : మండలంలోని నంబాల గ్రామ పంచాయితీలో మిషన్ కాకతీయ పనులు బుధవారం పకీరుపల్లె చింతలచెరువులో ఎంపీపీ సంజీవ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెరవు పనులు సకాలంలో పూర్తి చేయాలని నాణ్యత లోపించరాదని కాంట్రాక్టర్ రవీందర్ కు విన్నవించారు. ఈ చెరవు వ్యయం 64 లక్షలతో ప్రారంభం చేశామన్నారు. ఈ కార్యక్రమలంలో జడ్పీటీసీ బాబురావు, నంబాల సర్పంచ్ గజ్జల సుశీల, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శేఖర్, డైరక్టర్ సత్తెన్న, తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులు సోకకుండా ముందస్తు-బ్లీచింగ్
రెబ్బెన మండలంలో ఇందిరా నగర్ పున్జుమేరగూడ మరియు నక్కలగూడలలో బుదవారం నాడు ప్రజలకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా పలు వీదులలో మరియు మురికి కాలువలలో బ్లీచింగ్ జల్లారు పంచాయితి కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వలన రెబ్బెన సరంచ్ పెసరు వెంకటమ్మ మరియు పంచాయితి కార్యదర్శి రవీందర్ స్వయంగా పలు గ్రామలలో బ్లీచింగ్ జాల్లరు
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మడునయ్య పాల్గొన్నారు
ఇరవైరెండవ రోజుకు చేరిన గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక సమ్మె
రెబ్బెన మండలంలో గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక సమ్మె బుదవారానికి ఇరవైరెండవ రోజుకు చేరింది. గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక దీక్షలో బాగంగా గుంజిలు తిసి నిరశన తెలియజేసారు కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని ఇరవైరెండవ రోజు అయిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు
Tuesday, 21 July 2015
మధ్యాహ్న బోజన పథకాన్ని పరిశీలించిన ఎంపీడీఓ
రెబ్బెన : మండలంలోని నంబాలం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎంపీడీఓ ఎం ఏ అలీం మధ్యాహ్నా బోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులను భోజనం గురించి అడిగి తెలుసు కొని వారితో కలిసి భోజనం చేశారు . 9, 10 తరగతి విద్యార్ధులకు సరైన బోజనం పెట్టాలన్నారు. ఎంపీడీఓ వెంట నంబాల సర్పంచ్ గజ్జల సుశీల . పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, సాక్షరభారత్ మండలకోఆర్ఢినేటర్ సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ వేణు గోపాల్ , సింగిల్ విండో డైరక్టర్ గజ్జల సత్యనారాయణ పాల్గొన్నారు
ఎరువులకోసం జేడీఏని నిలదీసిన రైతులు
రెబ్బెన మండలంలోని వ్యవసాయ సహకార బ్యాంకుకు మంగళవారం వచ్చిన జేడీఏ రోజ్‌లీలాను నిలదీశారు. కొన్ని రోజులుగా ఎరువులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కొరత ఉండడంతో మండలంలోని 12 గ్రామ పంచాయతీల రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. జేడీఏ రోజ్‌లీలాతో రైతులు ఆవేశంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ఎరువుల కొరత లేదని రెండు రోజులలో పంపిస్తామన్నారు. ఆమె వెంట ఏఓ మంజూల, ఏఈఓ మార్క్ తదితరులు పాల్గొన్నారు.
టీవీవీ అంబేద్కర్‌కు వినతి పత్రం
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. టీవీవీ మండల అధ్యక్షుడు కడతల సాయి మట్లాడుతూ.. ఆసిఫాబాద్ డివిజన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ విషయంపై అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన ప ట్టించుకోవడంలేదని ప్రభుత్వం ఈ కళాశాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల శివాజీ, మండల కన్వీనర్ సాయి నవతేజ, శ్రావణ్, నవీన్, ప్రవీణ్, తిరుపతి పాల్గొన్నారు.
కేసీఆర్ మనసు మార్చు.. సమస్యలు తీర్చు
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకొని మా సమస్యల వెంటనే తీర్చాలని రెబ్బెన మండలంలోని పంచాయతీ కార్మికులు మంగళవారం దేవుణ్ణి ప్రార్థిస్తూ నిరసన తెలిపారు. వారు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 21 రోజులు గడిచిన పట్టించుకోవడంలేదని మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
సెక్రటరీల సమావేశం
రెబ్బెన : ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందికి మంగళవారం సమావేశం నిర్వహించారు. హరిత హారం పథకంలో భాగంగా గుంతలు తవ్విన కూలీలకు వారం రోజులలో డబ్బులను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్ గౌడ్ ఎంపీడీవో ఎమ్‌ఏ అలీం ఏపీఎం రాజ్ కుమార్ సాక్షర భారత్ కో ఆర్డినేటర్ సాయిబాబా మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌లు టెక్నికల్ అసిస్టెంట్‌లు కంప్యూటర్ ఆపరేటర్‌లు కూలీలు పాల్గొన్నారు.
Sunday, 19 July 2015
వర్షం కోసం ప్రత్యేక పూజలు
రెబ్బెన :వర్షాలు పడకపోవడం తో గ్రామంలోని వరి పొలాలు మరియు పత్తి పంటలు ఎండి పోతున్నాయి అని రెబ్బెన మండలంలోని పుంజుమెరగూడెంకు చెందినా మహిళలు, రైతులు ఆదివారం రోజున వరుణ దేవుడికి మరియు గ్రామా దేవత ఐన పోచమ్మ తల్లికి నీళ్ళ బిందలతో, బోనాలతో ఊరేగింపు గా చేరి ప్రత్యేక పూజలు చేసారు వరుణుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురియాలను వేడుకుంటూ పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య తలపై నీటి బిందెలతో ఊరేగింపూ నిర్వహించారు. ఊరి చివరలో ఉన్న గ్రామా దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. వర్షాలు సంవృద్దిగా కురియాలని దేవతలను వేడుకున్నారు.
వినూత్న రీతిలో జీపీ కార్మికుల నిరసన
రెబ్బెన : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెబ్బెన గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఆదివారం కార్మికులు ఇస్త్రీ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సమ్మె చేపట్టి 19వ రోజులు రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
పార మెడికల్ మండల కమిటీ ఎన్నిక
రెబ్బెన : రెబ్బెన మండలం పార మెడికల్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా స్వామి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, కార్యదర్శిగా అర్జున్‌లను ఎన్నుకున్నారు
Saturday, 18 July 2015
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
మైనార్టీ నాయకులు అన్వర్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌కుమార్
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
రెబ్బెన ; నెలరోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన అనంతరం పవిత్ర రంజాన్‌ను పురస్కరించుకుని పర్వదినం సందర్భంగా శనివారం నాడు రెబ్బెన మండలంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరుకొని ప్రార్థనలు చేశారు.సర్వ మానవాళి క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు బంధువు, మిత్రులను కలిసి ముస్లిం సోదరులు ముబారక్ తెలిపారు.ఈసందర్బంగా ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రెబ్బెన లో ఘనంగా రంజాన్ పండుగ
Subscribe to:
Posts (Atom)