Thursday, 1 June 2017

హమాలీ కార్మికుల పరిరక్షణ చట్టం తీసుకురావాలి ; బోగే ఉపేందర్

హమాలీ కార్మికుల పరిరక్షణ చట్టం తీసుకురావాలి ;  బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 01  (వుదయం ప్రతినిధి);సివిల్,నిత్యావసర ఆహార పదార్థాలు సరఫరా చేసే హమాలీలకు ఉద్యోగ భద్రత  కల్పించి,హమాలీ కార్మికుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి   బోగే ఉపేందర్,జిల్లా కోశాధికారి  రాయిల్ల నర్సయలు అన్నారు. గురువారంనాడు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో హమాలీ కార్ర్మికులు చేస్తున్న రీలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి అనంతరం వారు మాట్లాడుతూ గత 40 హమాలీ కార్మికులు  నిత్యావసరవస్తువులు పంపిణి చేస్తున్న చాలీచాలని వేతనాలతో  జీవనం సాగించడం కష్టతరం అవుతుంది అని అన్నారు. కనీసవేతనం 25000వేలు రూపాయలు ఇతర రాష్ట్రలలో  చెల్లింస్తున్న విధంగా అమలుపరచాలని  డిమాండ్ చేసారు. అలాగే  రేషన్ షాపులో  14 రకాల నిత్యావసరవస్తువులు పంపిణీచేస్తు రేషన్ వవస్థను కొనసాగించాలని అన్నారు. హమాలీ కార్మికులకు పని భద్రతను కలిపిస్తూ 50ఏళ్ళు పై బడినవాళ్లకి 3000రూపాయల పింఛన్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు, ఏఐటీయూసీ  నాయకులూ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment