కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 09 (వుదయం ప్రతినిధి); జిల్లా లోని కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పిసన్ ప్రీత్ సింగ్ గారు శుక్రవారం రోజున ఆకస్మికం గా తనిఖి చేసారు .ఈ సందర్బం గా అయన స్టేషన్ లోని పెండింగ్ కేసు లు యొక్క పూర్వ పరాలు పరిశిలిచారు ,పరిష్కారం కానీ కేసులు ,వాటి నమోదు గురించి రూరల్ ఎసై రాజేష్ ను అడిగి తెలుసుకన్నారు ,ప్రజా సమస్యల పైన సత్వరం స్పందించాలని సిబ్బంది ను ఆదేశించారు ,రూరల్ పోలీసులు కు ఖరిఫ్ సీజన్లో జరిగే విత్తనా మోసాల పైన అవగాహన సదస్సులు నిర్వహించి నకిలీ విత్తనాలను నిర్మూలించేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు , కాగజ్ నగర్ పోలీసు స్టేషన్ లొ గల సిబ్బంది తో విలేజ్ పోలీసింగ్ గురించి వారికీ కేటాయించిన గ్రామాల సందర్శన ఆయా గ్రామాల సమాచార సేకరణ,వాటి పైన గ్రామస్తుల స్పందనను క్రమము తప్పకుండా తన ద్రుష్టి కు తీసుకు రావాలని,ఇందులో నిర్లక్ష్యం వహించిన వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని జిల్లా ఎస్పి హెచ్చరించారు ,క్రమము తప్పకుండ వి .పి.ఓ లు గ్రామాలను సందర్శించి ,గ్రామాలలో నెలకొని వున్నా సమస్యలను తన ద్రుష్టి కు తిసుకురావాలని వి.పి.ఓ లను ఆదేశించారు ,మరియు కాగజ్ నగర్ డీఎస్పి గారి తో మరియు కాగజ్ నగర్ టౌన్ సి ఐ నాగేందర్ లతో సమావేశము ను నిర్వహించి గతం లొ ఏర్పాటు చేసిన సి.సి కెమెరా ల గురించి వాటి యొక్క పని తీరు గురించి తెలుసుకున్నారు మరియు కాగజ్ నగర్ లొ నూతనము గా ఏర్పాటు చేయబోయే సి.సి కెమెరా లు ఏర్పాటు చేయు ప్రదేశాలను గమనించారు. ఈ కార్యక్రమము లొ కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , కాగజ్ నగర్ టౌన్ సి ఐ నాగేందర్ , కాగజ్ నగర్ రూరల్ సిఐ రమేష్ బాబు ,కాగజ్ నగర్ రూరల్ ఎసై రాజేష్ కుమార్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment