నిరుద్యోగ యువతకే అవకాశం ఇవ్వాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13 (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించే అతిథి అధ్యపకుల నియమాకల్లో నిరుద్యోగ యువతకే అవకాశం ఇవ్వాలని,రిటైర్డ్ అధ్యపకులకు అవకాశం కల్పించకుడదని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదని అన్నారు. ప్రస్తుతం నియమిస్తూన్న ఉద్యోగ నియమకాల్లో పుటకో నిబంధన పెడుతూ యువతకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు లేక ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించే అతిథి అధ్యపకుల నియమాకాల్లో రిటైర్డ్ అధ్యపకులను నియమించకుండా నిరుద్యోగ యువతనే నియమించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను కలుపుకొని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment