Thursday, 22 June 2017

కోల్ బెల్ట్ దుకాణాల బంద్ విజయవంతం

కోల్ బెల్ట్ దుకాణాల బంద్  విజయవంతం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని గత వారం రోజులుగా జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు కార్మిక సంఘాల,రాజకీయ పార్టీల పిలుపు మేరకు గోలేటిలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ విజయవంతం. బంద్ కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు సిపిఐ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.

No comments:

Post a Comment