Thursday, 22 June 2017

జనరల్ మేనేజర్ కార్యాలయం ముట్టడించిన ఏఐటీయూసీ శ్రేణులు

జనరల్ మేనేజర్ కార్యాలయం ముట్టడించిన ఏఐటీయూసీ శ్రేణులు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో  కార్మికుల ప్రధానమైన డిమాండ్ వారసత్వ ఉద్యోగాల కోసం అన్ని జాతీయ సంఘాలు ఈ నెల 15వ తేదీ నుండి నిరవధిక  సమ్మె తలపెట్టిన  విషయం విదితమే.దానిలో భాగంగా సమ్మె  తలపెట్టి గురువారం నాటికి 8వ రోజు కాగా రెబ్బెన మండలం గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని జాతీయ సంఘం అయిన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ సంధర్బంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి,గోలేటి  బ్రాంచ్ ల  ఇంచార్జి చిప్ప నర్సయ్య మాట్లాడుతూ   రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని అన్నారు.సింగరేణిలోనే కాకుండా తెలంగాణ స్వరాష్ట్రంలో అవినీతి,అక్రమాలు పెరిగాయని,తెరాస పాలకులు భూ దందాలు, పోటీ పరీక్షలలో పైరవీలకు ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిచారు.టిబిజికకేఎస్ వారసత్వ   ఉద్యోగాలను కల్పించకపోవడమే కాకుండా,వారసత్వాల కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను విచ్చిన్నం చేసి మరో సారి కార్మికులను మోసం చేసిందని దుయ్యబట్టారు.దీనిని కార్మికులు గుర్తుపెట్టుకొని టిబిజికేఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.అవగాహనా లోపం,కార్మిక చట్టాలు తెలియని ప్రాంతీయ సంఘాలను సింగరేణిలో పాతరవేయాలని అన్నారు.కార్మికులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలో స్వచ్చందoగా సమ్మెలో పాల్గొనాలని కార్మికులను వారు కోరారు.అంతక ముందు  జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏఐటీయూసీ,సిపిఐ,నాయకులూ భూక్య జగ్గయ్య,జూపాక రాజేష్,సోకాల శ్రీనివాస్,సత్యనారాయణ,బిక్షుమయ్య,చంద్రశేఖర్,బోగే ఉపేందర్,రవీందర్,చుంచు రాజన్న,దివాకర్,జాడి స్వామి,బాపు,నర్సింగరావు,కిరణ్ బాబు,బాలయ్య,పరికిపండ్ల రమేష్,ఎం.శేషు,రాయిల్ల నర్సయ్య,కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment