రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ; సింగరేణి కార్మికుల పిల్లలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి కార్మికుల పిల్లలకు న్యాయం సింగరేణి కార్మికుల పిల్లల సంఘం నాయకులు దుర్గం రవీందర్, సిరికొండ రవికిరణ్, ముద్దసాని శ్రావణ్ లు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున సింగరేణి కార్మికుల పిల్లల సంఘం ఆద్వర్యంలో గోలేటిలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేశామని, జైలుకెళ్ళి కేసులు ఎదుర్కున్నామని, విద్యను సైతం పక్కన పెట్టి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని గుర్తు చేశారు. ఆంధ్ర పాలనలో సింగరేణి కార్మికులకు వారి పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మా భవిష్యత్తు మరుతుందని ఉద్యమాలు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్నికల్లో టి.ఆర్.యస్. పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపై పెడతానాని చెప్పిన ముఖ్యమంత్రి ఇచ్చిన హమీని విస్మరించడం జరిగిందని అన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకై జరుగుతున్న సమ్మెను విఫలం చేయాడానికి చూస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికైన సమ్మెలో పాల్గొని వారసత్వ ఉద్యోగాల సాధనకు పోరాటం చేయాలని, సమ్మెను విఫలం చేసే ప్రయాత్నాలు మానుకోవాలని అన్నారు. సమ్మెను విఫలం చేసి కార్మికులకు వారి పిల్లలకు అన్యాయం చేసే కార్మిక సంఘాలకు తగిన బుద్ధి చేప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల పిల్లలు రవి, కిరణ్, మహేష్, మనోహర్, రవికుమార్, సంజీవ్, రమేష్, నరేష్, మహేంధర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment