కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 11 (వుదయం ప్రతినిధి); రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం కార్మికులకు వారసత్వపు ఉద్యోగ హక్కును కల్పించేందుకు కృషి చేస్తుందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే. రవిశంకర్ అన్నారు గోలేటి లోని ఖైరిగూడ లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికులకు వారసత్వపు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధం గా ఉందని, వారసత్వపు ఉద్యోగాలపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎలాంటి న్యాయపరంమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు . జాతీయ సంఘాలు ఇలాంటి తరుణంలో సమ్మెకు పిలుపునివ్వటం సరికాదు అన్నారు . ప్రత్యేక రాష్ట ఏర్పాటు అనంతరం సింగరేణి సంస్థకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది అన్నారు . వారసత్వపు ఉద్యోగాల విషయం లో యాజమాన్యం వ్యతిరేకంగా లేదని యాజమాన్యం అనుకూలంగా ఉన్నపుడు సమ్మెలు ఎవరికోసమో కార్మికులు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పాదనకు కావాల్సిన బొగ్గును అందించాల్సిన బాధ్యత సింగరేణిఫై ఉందన్నారు. సింగరేణి వ్యాప్తంగా కేవలం 7రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని ఇలాంటి సమయంలో కార్మికులు సమ్మె చేపడితే సంస్థకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు . ఒక్క రోజు కార్మికులు సమ్మె చేస్తే సంస్థకు 41 కోట్ల నష్టం వాటిళ్లుతుందన్నారు . హక్కుల కోసం కార్మికులు సమ్మె చేపడితే తప్పు లేదని కానీ కొన్ని సంఘాలు తమ అవసరాలకు కోసం కార్మికులను తప్పుదోవ పాటిస్తున్నారని అన్నారు . న్యాయనిపుణుల సలహాల సూచనల కోసం యాజమాన్యం ప్రయత్నిస్తుందని త్వరలోనే వారసత్వపు ఉద్యోగాల అమలుపై కోర్టు తీర్పు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు . ఈ కార్యక్రం లో ఎస్ వో టూ జీ ఏం కొండయ్య , డి జీ ఏం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ , డివై పి ఏం రామశాస్త్రి పాల్గొన్నారు.
No comments:
Post a Comment