నిత్యావసర సరుకులు పంపిణి లో ప్రభుత్వాలు విఫలం ; ఏఐటీయూసీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి); పెద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణి చెయ్యడం లో రాష్టప్రభుత్వం విఫలం అయిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య అన్నారు , ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో అమ్మ అభయహస్తం పేరుతో 14 రకాలు నిత్యావసర సరుకులు పంపిణి చేసిందని కానీ తెలంగాణ రాష్టం లో మాత్రం ఒక్కొక్క నిత్యావసర సరుకులు తగ్గిస్తూ చివరకు బియ్యం కిరోషిన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు . బంగారు తెలంగాణ పేరుతో అధికారం లోకి వచ్చిన తెరాస పార్టీ ఇప్పుడు నిత్యావసర సరుకుల పంపిణి చెయ్యడం లో గోరంగా విఫలం అయిందని అన్నారు బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమం లో రామడుగుల శంకర్ . తోట తిరుపతి, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment