Wednesday, 14 June 2017

చేగువేరాను ఆదర్శంగా తీసుకొవాలి ;ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

చేగువేరాను ఆదర్శంగా తీసుకొవాలి ;ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 14  (వుదయం ప్రతినిధి): చేగువేరాను యువత ఆదర్శంగా తీసుకొని అవినీతికి, పెట్టుబడి వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున కె.ఎల్.మహేంధ్ర భవన్ లో చేగువేరా 89వ జయంతి ఉత్సవాలను ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ ప్రాంతానికి,దేశానికి అతీతంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని అన్నారు. పెట్టుబడిదారి వర్గం ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చేగువేరా పేద ప్రజల పక్షాన పోరాటం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంలో టి.ఆర్.యస్. ప్రభుత్వం హమీలతోనే కాలం గడుపుతుందని అన్నారు. యువత చెడు వ్యసనలకు దూరంగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా , ప్రజాస్వామ్య హక్కులకై, ఉద్యోగ హక్కులకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి నర్సయ్య,నాయకులు అశోక్,లోకేశ్,బద్రి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment