Thursday, 29 June 2017

ప్రకృతిలో మమేకమై మొక్కలు నాటుదాం ;జీఎం రవిశంకర్

ప్రకృతిలో మమేకమై మొక్కలు నాటుదాం ; జీఎం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి);  ప్రకృతిలో మమేకమై ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని జీఎం రవిశంకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్బంగా గురు వరం బెల్లం పెళ్లి ఏరియా గోలేటి లోని వివిధ పాఠశాలల  విద్యార్థుల చే కార్యాలయం నుండి ర్యాలీని నిర్వహించి అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మనమందరం ప్రకృతి లో మమేకం ఐ మొక్కలు నాటాలన్నారు . ప్రకృతిలోని జీవ జాతులన్నీ మానవ జాతి తప్ప ప్రకృతికి విగతం కలగకుండా ప్రకృతికి సానుకూలంగా జీవనం సాగిస్తున్నాయని కానీ మానవజాతి వింత చర్యలు వింత పోకడలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ప్రకృతి విఘాతం కల్పిస్తున్నాయని తెలిపారు. ఇక నుంచి సర్వ మానవ జాతి ప్ర కృతి మరియు  పర్యావరణ విలువలను గుర్తించి ప్రకృతికి అనుకూలంగా జీవనం కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమం లో సదాశివ్. తిరుపతి. కే కొండయ్య. శ్రీరామ శాస్రి . కృష్ణ చారి . ఎన్ వెంకటేశ్వర్ రావ్ . తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment