కార్మికులు యధావిధిగా విధులకు హాజరు ; జనరల్ మేనేజర్ రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వం అమలు చెయ్యాలని ఐదు జాతీయ సంఘలు తలపెట్టిన నిరవధిక సమ్మె పిలుపుకు కార్మికులు యధావిధిగా విధులకు హాజరవుతున్నారని ఏరియా జనరల్ మేనేజర్ కె రవిశంకర్ తెలిపారు. ఈ నెల 15 నుండి ప్రారంభమైన సమ్మెలో బెల్లంపల్లి ఏరియా లో హాజరు శాతం ఉత్పత్తి వివరాలు తెలిపారు. మొదటి రోజు 51 శాతం హాజరు, రెండవ రోజు 57 శాతం హాజరు, మూడవరోజు 62 శాతం హాజరుక, నాలుగవరోజు 77 శాతం హాజరు, ఐదవరోజు 77 శాతం హాజరు, ఆరవరోజు 87 శాతం హాజరుకాగా ఏడవరోజు93శాతం హాజరుతో కార్మికులు ఏలాంటీ ఆటంకం లేకుండా విధులకు హాజరు కావడం జరిగిందన్నారు. ఎనిమిదవ రోజున మొదటి షిప్ట్ లో 95 కార్మికులు హాజరైనారు మొదటి షిప్ట్ లో కార్మికులు 1282 మందికి 895 హాజరైనారు బొగ్గు ఉత్పత్తికి సహకరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గురువారం రోజున మొదటి షిప్ట్ లో 6050 టన్నుల లక్ష్యం కు గాను 7301 తన్నులు సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో అన్ని ఏరియాలకు హాజరుశాతం గణనీయంగా పెరిగింది అన్నారు. మిగతా కార్మికులు తమ వేతనాలు నష్టపోకుండా వెంట్లనే విధులకు హాజరు అవుతూ సంస్థ అభివృధికి సహకరించలని కోరారు.
No comments:
Post a Comment