ప్రజా సమస్యల పరిష్కరించెందుకే పోలీసులు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 05 (వుదయం ప్రతినిధి); జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల విబాగం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదు విబాగం కు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా పోలీసులు శాంతి భద్రతల తో పాటు గా జిల్లా లోని మారుమూల ప్రాంతాల లోని ప్రజలతో మమేకం అయి వారికీ , నేరాలు మోసాలు పట్ల అవగాహన కలిపిస్తూ వారిని చైతన్య వంతులను చేసే ల కార్యక్రమాలను చేపడుతున్నామని,జిల్లా లోఫ్రెండ్లీ పోలీస్ నెలకొని వుందని ఈ స్నేహ పూరిత వాతావరణం ను ఇలాగే కొనసాగిస్తామని ఇక పై సమస్యల పైన వారి బాగాస్వామ్యం తో ముందుకు వెళ్లి వారికీ లబ్ది చేకురేలా ప్రయత్నిస్తామని తెలిపారు. జిల్లా లొ కుల బహిష్కరణల వంటి దురాగతాలు, మూడ విశ్వాలు వల్ల తమకు తెలియకుండానే ఇతరులకు హాని కలిగే పనులు జరుగుతున్నాయి అని వీటి వల్ల అమాయక ప్రజలు ఇబ్బంది పడుర్తున్నారు అని తమ ద్రుష్టి కు వచ్చిందని ఇలాంటివారిని అసలు ఉపేక్షించబోమని ,వారి పైన తగు రితి లొ క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని చెప్పారు , జిల్లా లొ శాంతి భద్రత ల సమస్య తలెత్తే ఎలాంటి విషయము ను సహించబోమని ,గ్రామస్థులకు తగు రితి లొ అవగాహన కలిపించే అవగాహనా కార్యక్రమాలని చేపడుతామని తెలిపారు, సోమవారం ప్రజా వాణి లొ ఆసిఫాబాద్ మండలము దస్నాపూర్ కు చెందిన మెంగ్రే బాపూరావు అతని సోదరులు తమ యొక్క కుల పెద్దలు తమను కుల బహిష్కరణ చేసారు అని తమ యొక్కన్యాయమైన భూమి ను అన్యాయం గా వేరోకకరికి అన్యాక్రంతం ను వ్యతిరేకించి నందుకు కుల బహిష్కరణ చేసారని ఎస్పి ఎదుట రోదించారు. దీనిపైన స్పందించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ వెంటనే దీని పైన సమగ్ర విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పి సీసీ శ్రీనివాసు , డి.పీ.ఓ అధికారి సూర్యకాంత్ , పి.ఆర్.ఓ మనోహర్ లు మరియు ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment