సింగరేణి లో తెలంగాణ ఆవిర్బావ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 02 (వుదయం ప్రతినిధి); తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో ఉదయాన్నే తెలంగాణ రన్ తో ప్రారబించారు. ముందుగా జి ఎం కార్యాలయంలో జి ఎం రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహప్రతిష్టపనా చేసి తెలంగాణ తల్లి కి పూల మాలలు వేసి అమరులను స్మరింపచేసారు. సాయంత్రం సింగరేణి మైదానంలో తెలంగాణ వంటకాలతో కూడిన గదులను ప్రారబించారు. కార్మిక ఉద్యోగులు మహళలకు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాట్‌పుట్ హ్యాడ్‌బాల్, త్రోబాల్, రన్నింగ్, మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. సాయంత్రం వేళలో తెలంగాణ ధూం ధాం పాటలతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డి జి ఎం పర్సనల్ జె చిత్తరంజన్కుమార్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్‌రావు, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ రమేష్, మురళి, స్థానిక నాయకులు, అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment