Friday, 23 June 2017

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23  (వుదయం ప్రతినిధి);  రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. శుక్రవారం రోజున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎఐఎస్ఏఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యార్థుల సమస్యలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందరాని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు,త్రాగునీటి సౌకర్యం,ప్రహరీ గోడ తదితర సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.ఇప్పటికి పూర్తిగా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి, ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని,తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని,ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ అధ్యక్షుడు వికాస్,కార్యదర్శి పుదారి సాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి,ప్రణయ్, తిరుపతి,మహిపాల్,సాయి,శ్రీకాంత్,రవివర్మ,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment