నేర సమీక్షా సమావేశం ను నిర్వహించిన జిల్లా ఎస్పి – సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24 (వుదయం ప్రతినిధి); పోలీసులు ప్రజల కు నమ్మకం కలిగేలా ,విదులను కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలనీ అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు సూచించారు శనివారం కుంరం భీం జిల్లా హెడ్ క్వార్టర్ లో ని నూతనము గా నిర్మించిన కాన్ఫరెన్స్ సమావేశమందిరం లో జిల్లా ఎస్పి గారు నేర సమిక్ష సమావేశం ను నిర్వహించారు .ఆయన మాట్లడుతూ ప్రజా సంక్ష్యేమం కు ప్రథమ ప్రాధాన్యం జిల్లా లోని మారుమూల గ్రామల అభివృద్ధి కు పునరంకితం అవ్వాలని ,నేర పరిశోదనలో టెక్నాలజీ ను వాడుకోవాలని ,నేర విచారణ వేగవంతం గా క్రమబద్దం గా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని , స్టేషన్ లోని పెండింగ్ కేసు లు యొక్క పూర్వ పరాలు తెలుసుకొని తగిన సూచనలను చేసారు ,పరిష్కారం కానీ కేసులు పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు జిల్లా లో జరిగే నేరాల పట్ల అప్రమత్తతో వుండాలి అన్నారు , పోలీసు స్టేషను కు వచ్చే ఫిర్యాదు దారుల తో హుందాగా గౌరవం గా మెలగాలి ,పోలీసులు అంటే ప్రజాసేవకులు అని గుర్తుచుకోవాలన్నారు , విలేజ్ పోలీసింగ్ లో వారి,వారి కి కేటాయించిన గ్రామాల సందర్శన ఆయా గ్రామాల సమాచార సేకరణ,వాటి పైన గ్రామస్తుల స్పందనను,గ్రామల లో గల సమస్యలను నోట్ చేసుకుని క్రమము తప్పకుండా తన ద్రుష్టి కు తీసుకు రావాలని ఇందులో నిర్లక్ష్యం వహించిన వారి పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఖరిఫ్ సీజన్లో జరిగే విత్తనా మోసాల పైన అవగాహన సదస్సులు నిర్వహించి నకిలీ విత్తనాలను నిర్మూలించేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ ,డిసీఅర్బీ ఎసై రాణాప్రతాప్ ,అసిఫాబాద్ టౌన్ సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్ ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి కోర్ ఇంచార్జీ శ్రీనివాస్,J.శ్రీనివాస్ ,పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment