పాత్రికేయులకు సంక్షేమ పధకాలను అమలు పర్చాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); కొమురం భీం అసిఫాబాద్ జిల్లా లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు జాప్యం చేయకుండా వెంటనే అక్రిడియేషన్,ఆరోగ్య కార్డులు జారిచేయలని,శాశ్వత డీపీఆర్ఓ ను వెంటనే నియమించి పాత్రికేయులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు టీయూడబ్ల్యుజె (ఐజెయూ) జిల్లా శాఖా ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి చంపలాల్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీయూడబ్ల్యుజె (ఐజెయూ) జిల్లా కన్వీనర్ అబ్దుల్ రహేమాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్రిడియేషన్,ఆరొగ్య కార్డులు జారీ అయ్యాయని,కానీ ఇప్పటివరకు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో జారీ కాకపోవడం చాలా దారుణం అన్నారు.ప్రతి ఒక్క పాత్రికేయునికి ఇంటి స్థలాలు ఇచ్చి రెండు పడకల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని పాత్రికేయులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన పాలనాధికారి చరవాణిలో ఇంచార్జి డిపిఅర్ఓ తో మాట్లాడి మూడు రోజుల్లో అక్రీడీయేషన్,ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అక్రిడియేషన్ కమిటీ కో కన్వినర్ వేణుగోపాల్,సభ్యులు ప్రకాష్ గౌడ్,సదానంద బెంబ్రె,రాజు,రమేష్,వెంకన్న,జానకిరామ్,మిలిన్,మహేష్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment