హోంగార్డ్ లను ఆదుకునేందుకు చేయూత పథకం
జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 06 (వుదయం ప్రతినిధి); జిల్లాలోని హోoగార్డ్ ల సంక్షేమం కోసం పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్ హోంగార్డ్ సిబ్బంది సంక్షేమాం కోసం చేయూత పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా జిల్లాలోని మొత్తం హోంగార్డ్ లందరికి లబ్ది చేకూరనుందని,ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డ్ లకు,విధినిర్వహణలో గాయపడిన హోంగార్డ్ లకు ,వ్యాధులతో బాధపడే హోంగార్డ్ కుటుంబాలకు సాంత్వన చేకూరుతుందని,ఒక వేళ అత్యవసర వైద్య సదుపాయం కావలిసిన సమయం లో కూడా వారికీ ప్రత్యేక వాహన సదుపాయం కలిపిస్తామని ,ఇలాంటి సమయంలలో ఆర్థికంగా వారిని అదుకునేందుకు కొమురంభీం జిల్లా పోలీసులు ముందు ఉన్నారని తెలిపారు.ఈ విధమైన భరోసా వారిలో కల్పించడం ద్వారా వారి యొక్క ఆత్మస్థైర్యం పెరిగి సమాజం లో నూతన ఉత్సాహం తో విధులు నిర్వర్తిస్తారని తెలిపారుఈ కార్యక్రమము లో ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డ్ గుణవంతురావు బార్య కమలబాయి కుటుంబానికి తక్షణ సహాయం క్రింద జిల్లా ఎస్పి 60,400 /- రూపాయల చెక్కును అందచేశారు.మరియు వారి కుటుంబానికి అందవలిసిన బెనిఫిట్స్ అన్నిటిని తక్షణం అందించేందుకు చర్యలు తిసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ వెంకటేశ్వరులు,ఆసిఫాబాద్ టౌన్ సీఐ సతీష్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పి సీసీ శ్రీనివాసు , డి.పీ.ఓ అధికారి కేదారిసూర్యకాంత్, పి.ఆర్.ఓ మనోహర్ లు ,హోం గార్డ్ ఆర్ ఐ అనిల్ కూమార్, హోంగార్డ్ డ్యూటీమేజర్ వాజిద్అహ్మద్ఖాన్ , అవినాష్ ,హోంగార్డ్ లు భూమన్న, వినేష్ ,ఫేరోజ్,మరియు సాగర్ లు పాల్గొన్నారు .
No comments:
Post a Comment