Friday, 9 June 2017

టిబిజీకేఎస్ కార్మికుల పక్షమా?యాజమాన్య పక్షమా?

టిబిజీకేఎస్ కార్మికుల పక్షమా?యాజమాన్య పక్షమా?
  • డోర్లీ ద్వారా సమావేశం సభలో ప్రశ్నించిన ఎస్.తిరుపతి.



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 09  (వుదయం ప్రతినిధి);  బెల్లంపల్లి ఏరియా డోర్లి 1 ఉపరితల గనిలో జాతీయ సంఘాలు శుక్రవారం రోజున ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ టిబిజీకేఎస్ సింగరేణిలో పనిచేసే కార్మికుల పక్షమా,సింగరేణ యాజమాన్యానికి తొత్తు సంఘమా, అని ప్రశ్నించారు. సమ్మెతోనే వారసత్వం అమలు అవుతుందని,కాబట్టి కార్మికవర్గం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టిబిజీకేఎస్ కార్మిక వర్గానికి చేసింది ఏమి లేదని,కార్మికులను మోసం చేసేందుకే వారసత్వ ఉద్యోగాల పేరిట డ్రామా ఆడి కార్మికుల ముందు బొక్కబోర్ల పడిందని అన్నారు.కార్మికుల ప్రధానమైన హక్కు వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాలు చేపట్టబోయే సమ్మెను విచ్చిన్నం చేసే కుట్రలు టిబిజీకేఎస్ పన్నుతుందని అన్నారు.ఎప్పటికైనా జాతియా సంఘాలు తలపెట్టిన సమ్మెలో టిబిజీకేఎస్ కూడా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్య మోగిలి,ఐఎన్టియూసి నాయకులూ ముచ్చర్ల  మల్లయ్య,ఐక్య సంఘలా నాయకులూ నర్సింగ రావు,మదన్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment