గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసి ఆదుకొంటాం
జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 07 (వుదయం ప్రతినిధి); మారు మూలా గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించి ఆదుకుంటామని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం తిర్యాణి మండలంలోని గోపెర గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి , రోడ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసారు . తిర్యాణి మండలం నుండి గోపెర వరకు రోడ్ మార్గాన్ని ఏర్పాటు చేసి స్వయంగా ఎస్ పి బస్సు నడిచే విధంగా ప్రణాళిక తాయారు చేసారు. కరీంనగర్ రేంజ్ డి.ఐ.జి రవివర్మ ముఖ్య అతిధులుగా విచ్చేసి నూతన బస్సును ప్రారంభించారు. వారిని గిరిజన సాంప్రదాయ నృత్యమైన గుస్సాడిలతో డి.ఐ.జి రవివర్మ, ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ లను సాధారణంగా ఆహ్వానించారు. ఇదంతా కొమురం భీం జిల్లా ఫ్రెండ్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ తానే స్వయంగా కృషిచేశారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజలకు పట్టణాలకు నివసిస్తున్న గిరిజన గ్రామా లను చూసి చాలించి పోయా నాని వైద్యం కోసం చదువు కోసం వెళ్లాలంటే ప్రయాణ మార్గం లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే రోడ్ సౌకర్యం ఏర్పాటు చేశామని బస్సు నడిచే విధంగా కృషిచేశామన్నారు . వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నరని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని న అన్నారు
సార్ మాకు దేవుడు ; మాకు గత కొన్ని సంవత్సరాలనుంచి ఊరికి రోడ్ లేక పోవడంతో అభివృద్ధి పనులకు , వైద్య సదుపాయాలు లేక చీకటిలో మగ్గుతున్న గిరిజన గ్రామాలకు వెలుగు చూపిన ఎస్ పి సం ప్రీత్ సింగ్ నిజం గా మా పాలిట దేవుడని ఆ ఊరి గ్రామస్థులు అంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలు చేసి పలువురిని ఆకట్టుకున్నారు
No comments:
Post a Comment