జులై 2వ తేదీన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); జులై 2వ తేదీన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ లోని వినయ్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని కాబట్టి జిల్లా లోని పీఆర్టీయూ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కె.జనార్దన్ కోరారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు కె.జనార్దన్,పూల రవీందర్,పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఫై.సరోత్తం రెడ్డి,ఏఐటిఓ ఛైర్మెన్ బి.మోహన్ రెడ్డి,పత్రిక ప్రధాన సంపాదకులు ఫై.సత్యనారాయణలు హాజరు అవుతరని తెలిపారు.ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించిన తర్వాత జిల్లాలో జరపబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.జిల్లా స్థాయి సమావేశం సందర్బంగా కొత్త జిల్లా సమితి ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆయనతో పాటు ఉపాధ్యాయులు సత్తెన్న,అనిల్,శ్రీనివాస్,పి.మల్లేష్,రోజారమని,స్వర్ణలత, పాల్గొన్నారు.
No comments:
Post a Comment