భూ సమస్యను పరిష్కరించాలని తహశీల్ధార్ కు వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి గ్రామా పంచాయతీ పరిధిలోని రేకులగూడెం ప్రజలు సోమవారం రోజున తహశీల్దార్ బండారి రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.గూడెం లో నెలకొన్న భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.గత 40 సంవత్సరముల నుండి కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ,కాలనీ లోకి వచ్చే రహదారిని,ఇంటి ఆవరణ ప్రాంతాలని అదే కాలనీ కి చెందిన మల్లు భాయి అనే మహిళా భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు.దీని పై స్పందించిన తహశీల్ధార్ మాట్లాడుతూ సమస్యను పరిశీలించి రెవిన్యూ సిబ్భంర్థిని విచారణకు ఆదేశించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు చింతకుంట్ల నారాయణ,రాయిళ్ల నర్సయ్య,భూర్స బుచ్చయ్యలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment