Wednesday, 31 May 2017

రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ; ఏఐటీయూసీ నాయకులు

రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి  ; ఏఐటీయూసీ నాయకులు  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30 ; (వుదయం ప్రతినిధి) ; రేషన్ డీలర్లకు  ఉద్యోగ భద్రత కల్పించాలని  ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు  బోగే ఉపేందర్ మరియు మండల  అధ్యక్షులు రాయిల్లా నర్సయ్యలు బుధవారం తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి సీనియర్ అసిస్టెంటుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 40 ఎళ్లగా రేషన్ డీలర్లు నిత్యావసరవస్తువులు పంపిణి చేస్తున్న చాలీచాలని కమిషన్లతో జీవనం సాగించడం కష్టతరం అవుతుంది అని అన్నారు. కనీసవేతనం 25000వేలు రూపాయలు ఇతర రాష్ట్రలలో  చెల్లింస్తున్న విధంగా అమలుపరచాలని  డిమాండ్ చేసారు. అలాగే  రేషన్ షాపులో  14 రకాల నిత్యావసరవస్తువులు పంపిణీచేస్తు రేషన్ వవస్థను కొనసాగించాలని అన్నారు. హమాలీ కార్మికులకు పని భద్రతను కలిపిస్తూ 50ఏళ్ళు పై బడినవాళ్లకి 3000రూపాయల పింఛన్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు కిషన్ సింగ్ రాజమణి తీరుపతి విజయ రాజయ్య జానకిరాంలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment