ప్రైవేట్ పాఠశాలల,కళాశాలల ప్రచారాలను అడ్డుకుంటాము
ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 10 (వుదయం ప్రతినిధి); ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ఆర్భాటపు ప్రచారలు మానుకోవాలని అదే విధంగా అసత్యపు ప్రచారం చేయవద్దని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.శనివారంనాడు గోలేటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం ధనార్జనే ద్యేయంగా,పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ నాణ్యతరహిత విద్యను అందిస్తున్నాయని ఆరోపించారు.లేని వసతులు ఉన్నట్లు కరపత్రలల్లో ముద్రించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.కనీస వసతులు కల్పించని ప్రైవేట్ యాజమాన్యాల పై విద్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రమాణాలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని,గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇలాంటి వాటి పై చర్యలు తీసుకోవడంలో విద్యశాఖ అధికారులు మాములుగా తీసుకుంటున్నారని అన్నారు.ప్రభ్యుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని,తరగతులు ప్రారంభమైన వెంటనే విధ్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని,ఏకరూప దుస్తులు పంపిణి చెయ్యాలని,ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చెయ్యాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు తొందరపడకుండా ప్రైవేట్ పాఠశాలలు చేసే ఆర్భాటాలకు లోనుకాకుండా,అలోచించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,గోలేటి పట్టణ అధ్యక్షులు పడాల సంపత్,పట్టణ కార్యదర్శి జాడి సాయికుమార్,ఉపాధ్యక్షులు జె.సంజయ్,వంశీ,టి.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment