అనందోత్సాహ లతో ఈద్ ఉల్ ఫితర్ సంబరాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26 (వుదయం ప్రతినిధి); నెలరోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన మరుసటి రోజు పవిత్ర రంజాన్ పర్వదినం నుపురస్కరించుకుని చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే 'రంజాన్ ' సోమావారం నాడుజిల్లాలోఅంతటా పండుగవతవరణం కనిపించింది ఆసిఫాబాద్,రెబ్బెన మండలాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు పెద్దఎత్తున తరలివచ్చి సర్వ మానవాళి క్షేమాన్ని ఆశించి పవిత్ర ప్రార్ధనలు చేసారు. ముస్లిం మత పెద్దలు ముస్లింసోదరులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు బంధు, మిత్రులను స్నేహితులను మతాలకతీతంగా ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా రెబ్బన ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెబ్బెన ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
No comments:
Post a Comment