Monday, 19 June 2017

ఆర్జీల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్

ఆర్జీల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్  ప్రీత్ సింగ్  

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);జిల్లా కేంద్రములోని పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్   ప్రజా ఫిర్యాదుల విభాగంను నిర్వహించి  ప్రజల నుండి వారి యొక్క సమస్యలను ఆర్జీల ద్వారా అందుకున్నారు.ఫిర్యాదు దారుల  సమస్యల పైన జిల్లా పోలీస్ ఉన్నతాధికారి  స్పందిస్తూ ఆయా పరిధి లోని అధికారులతో చరవాణిలొ మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకొని వాటిని  సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్బoగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజల కు నమ్మకం కలిగేలా,జవాబుదారిగా పని చేయాలని,కేసుల పురోగతి ను వెంట వెంటనే సీసీటీఎన్ఎస్ లో  నిక్షిప్తం చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.ప్రజా సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం  ఇవ్వాలని  జిల్లా లోని మారుమూల గ్రామల అభివృద్ధి కు వారి సంక్షేమముకు ప్రణాళిక బద్దంగా,వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ,వారి పిల్లలను పాఠశాలల,ఆశ్రమ పారశాలలకు పంపేలా చూడాలని,విడతల వారిగా గ్రామాలలో నెలకొని వున్నసమస్యలను తన ద్రుష్టికి  తీసుకురావాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  ఎస్బి సీఐ వెంకటేశ్వరులు,డిసీబీ ఎసై రాణాప్రతాప్,అసిఫాబాద్ టౌన్ సీఐ సతీశ్,ఎస్పి సీసీ శ్రీనివాస్,అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రహ్లాద్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్,ఐటి  కోర్  శ్రీనివాస్,పిఆర్ఓ మనోహర్,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment