రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 14 (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి రోడ్ దగ్గర బుధవారం సాయంత్రం జరిగిన రోడ్ ప్రమాదంలో రెబ్బెన కు చెందిన ఇద్దరు యువకులు(గౌరవ్ ) విక్కీ ఖోడియార్, పాగిడి రామ్ చందర్ లు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ మీద మందమరి లో జరిగిన స్నేహితుడి వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి బైక్ ఫై వస్తున్నప్పుడు వెనకాలే వస్తున్నా లారీ ఢీకొన్నట్లు రెబ్బెన సి ఐ మదన్ లాల్ తెలిపారు. ఈ సంఘటన తో రెబ్బెనలో విషాద ఛాయలు ఏర్పాడ్డాయి . అందరి స్నేహితులతో ఎల్లప్పుడూ కోలాహాలంగా తిరిగే విక్కి , రాంచందర్ లు మృతి చెందడముతో స్నేహితులు , బంధువులు బోరున తల్లడిల్లారు . ఈ మేరకు ఎస్ ఐ నరేష్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు .
No comments:
Post a Comment