జూన్ 26ను చీకటి దినంగా ప్రకటించాలి : భాజపా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26 (వుదయం ప్రతినిధి); జూన్ 26ను దేశ చరిత్రలో చీకటి దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రెబ్బేన మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా భాజపా జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా,రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యవసర పరిస్థితులను కల్పించి,ప్రజాస్వామ్యాన్ని కుని చేసిందని అన్నారు. న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి,న్యాయవ్యవస్థను అగౌరవ పాలు చేసిందని దుయ్యబట్టారు.అత్యవసర పరిస్థితి ముసుగులో అప్పటి ప్రభుత్వం చేసిన అరాచకాలకు,అన్యాయాలకు ఎదురు తిరిగిన వారిని అన్యాయంగా అరెస్టులు చేయించినా ఘనత అని విమర్శించారు.కాబట్టి జ్ఞే 26 ను చీకటి దీనంగా ప్రకటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులూ గుల్భము చక్రపాణి,మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సునీల్ చౌదరి,నాయకులూ గట్టు తిరుపతి,హస్ముక్లాల్,దేవేందర్ రెడ్డి,మండల మధుకర్,గాజుల మల్లేష్,నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment