నారాయణపుర్ లో గ్రామా సభ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో రెవెన్యూ మరియు వ్యవసాయ ఉమ్మడి శాఖల అద్వర్యంలో శుక్రవారం రోజున గ్రామా సభ నిర్వహించారు.ఈ గ్రామా సభలో ముఖ్య అతిధిగా రెబ్బెన మండల తహాశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ రైతుల కోసం నిర్వహించే గ్రామా సభలకు తప్పకుండా రైతులు హాజరయ్యి సహకరించాలని కోరారు.భూముల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి,భూముల క్రమబద్దీకరణ ఎంత శాతం వున్నదని తెలుసుకోవడం కోసం రైతు సమగ్ర సర్వే ఉపయోగపడిందని అన్నారు..గత నెల నిర్వహించిన రైతు సమగ్ర సర్వే లో రైతులందరూ నమోదు చేసుకోవడం జరిగింది,ఆ సందర్బంగా నమోదు చేసిన వివరాలు సక్రమమైనవ,కాదా అని పరిశీలించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలను క్షున్నంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామా రెవెన్యూ అధికారి ఉమ్లాల్,వ్యవసాయ విస్తరణాధికారి అర్చన,గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment