క్విజ్ పోటీలలో ఎస్ వి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రతిభ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); బెల్లంపల్లి ఏరియా లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో రెబ్బెన కు చెందిన సాయి విద్యాలయం ఇంగీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ను చాటారు . గోలేటి లో నిర్వహించిన క్విజ్ పోటీలలో స్థానిక ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆదె ప్రియాంక ప్రథమ స్థానమును సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ తెలిపారు . అదే విదంగా ఉపాన్యాసా పోటీలలో 8వ తరగతి చదువుతున్న కనక లక్ష్మి తృతీయ , సేండే సాయి కుమార్ తృతీయ స్థానములో నిలిచారు . వీరికి బెల్లంపల్లి ఏరియా జి ఎం రవి శంకర్ శుక్రవారం బహుమతులను అందజేశారు .వీరిని ఎంపిపి సంజీవ్ కుమార్ జెడ్పిటిసి బాబు రావు , ఎం ఏ ఓ వెంకటేశ్వర్లు , సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ఆసిఫాబాద్ మార్కెట్ కమితి వైస్ ఛైర్మెన్ శంకరమ్మ , తహశీల్ధార్ రమేష్ గౌడ్ , నాయకులూ నవీన్కుమార్ జైస్వాల్ , సోమశేఖర్ , రాజేశ్వర్ రావు , మధునయ్య , చిరంజీవి గౌడ్ , సుదర్శన్ గౌడ్ ,
సదాశివ్. తిరుపతి. తదితరులు అభినందించారు .
No comments:
Post a Comment