విద్యార్థుల హక్కులకై పోరాడుతాం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో పోరాటాలు చేస్తామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు. ఎఐఎస్ఏఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్వే నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తాసు పలుకుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వలన క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు,ప్రహరీ గోడ,మంచినీటి సౌకర్యం తదితర సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరని అన్నారు. విద్య సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న నేటికీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, అలాగే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి, నాయకులు అంజన్న ,సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment