Friday, 16 June 2017

రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా పోలీస్ అధికారి

రెబ్బెన పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా పోలీస్ అధికారి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16   కొమురంభీంజిల్లా లోని రెబ్బెన పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పిసన్ ప్రీత్ సింగ్ గారు శుక్రవారం రోజున ఆకస్మికం గా తనిఖి  చేసారు .ఈ సందర్బం గా  అయన స్టేషన్ లోని పెండింగ్ కేసు లు యొక్క పూర్వ పరాలు పరిశిలిచారు. గత రెండు రోజులుగా జరుగుతున్నా సింగరేణి సమ్మె సందర్భంగా గనులవాడ సుమారు వందకు పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమ్మె చేస్తున్న కార్మికులు ఎలాంటి అవాంఛనీయమైన కార్యక్రమాలకు పాల్పడిన చట్ట రీత్యా చెర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కారం కానీ కేసులు ,వాటి నమోదు గురించి  ఎస్సై నరేష్ కుమార్ ను అడిగి తెలుసుకన్నారు ,ప్రజా సమస్యల పైన సత్వరం స్పందించాలని సిబ్బంది ను ఆదేశించారు. క్రమము తప్పకుండ వి .పి.ఓ లు గ్రామాలను సందర్శించి ,గ్రామాలలో నెలకొని వున్నా సమస్యలను తన ద్రుష్టి కు తిసుకురావాలని వి.పి.ఓ లను ఆదేశించారుఈ కార్యక్రమము లొ కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , సి ఐ సీఐ మదన్ లాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment