కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 10 (వుదయం ప్రతినిధి); సింగరేణి లో అనేక పోరాటాల ద్వారానే కాంట్రాక్టు కార్మికులకు 1 వ తేదీ నుండి 7వ తేదీ లోపు యాజమాన్యం ఖాతాలలో జమచేస్తుందని ఇఫ్టూ నాయకులు బి.తిరుపతి, బ్రహ్మానందము లు అన్నారు.అదే విధంగా బెల్లంపల్లి ఏరియా లోని కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం అందడం లేదని అన్నారు. దీని మూలంగా కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని అన్నారు. కాబట్టి యాజమాన్యం ప్రకటించిన విధంగా కాంట్రాక్టరు లు డబ్బులు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment