మతసామరస్యం,సోదరభావంతోనే శాంతి సాధ్యం – ఐజి నాగిరెడ్డి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13 (వుదయం ప్రతినిధి); బారతదేశం అనేక కుల ,మతాలకు నిలయం అని ఏ వర్గం వారు అ వర్గం సంబందించిన పండుగలను, ఉత్సవాలను జరుపుకునేప్పుడు అన్ని వర్గాల వారు మత సామరస్యం పాటించాలని వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి గారు తెలిపారు మంగళవారం నిర్మల్ జిల్లా లోని స్థానిక జిల్లా పోలీసు ప్రధాన పోలీసు కార్యాలయాలంలో ఐజి నాగిరెడ్డి గారి అద్యక్షతన మూడు జిల్లా ల ఎస్పి లతో కమ్యూనల్ పోలీసింగ్ పైన సమావేశం ను ఏర్పాటు చేశారు,ఈ యొక్క సమావేశం లో ఐజి మాట్లాడుతూ జిల్లా లొని ముస్లిం సోదరి, సోదరులందరు ,రంజాన్ మాసం ను ,రంజాన్ ను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ,.జిల్లా లో రంజాన్ మాసము సందర్బంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ,అన్ని శాఖల సహకారం తీసుకోవాలని , శాంతి భద్రతల అదుపులో ప్రజల యొక్క బాగస్వామ్యం ఎంతో ముఖ్యము అని ,వారి సహకారం తోనే శాంతియుత వాతావరణం సాధ్యము అని ,ఎక్కడయితే అందరు సోదరభావం కలిసి ,మెలిసి వుంటారో అక్కడ అబివృద్ది జరిగి అందరు సంతోషంగా ఉంటారని తెలిపారు , అంతేకాక జిల్లా లొ మత సమస్యలు తలెత్తకుండా తిసుకోవలిసిన చర్యల గురించి జిల్లా ఎస్పిలకు వివరించటం జరిగింది. ఈ సమావేశం లోకరీంనగర్ రేంజ్ డి ఐ జి రవి వర్మ మాట్లాడుతూ మతసామరస్యం ను కాపాడుకోవడానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వున్నదని ఈ పవిత్ర మాసం లో ఎలాంటి ఆసాంఘిక ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలిసులకు సహకరించాలని కోరారు ,జిల్లా లో నేరాల అదుపునకు పోలీసు యంత్రంగము అంతా కష్టపడి మీకోసమే పనిచేస్తుందని ,"ఫ్రెండ్లీ పొలీసింగ్ "లో బాగంగా పోలీసులు ప్రజలతో మమేకం అయి వారిలో భయం ను పోగొట్టి భరోసా కల్పిస్తున్నారన్నారు దీనితో ప్రజలు పోలీసులను తమ సన్నిహిత మిత్రులలా భావిస్తున్నారని ఆయన అభివర్ణించారు. అనంతరం నిర్మల్ ,కుమ్రంభీం ఆసిఫాబాద్ ,ఆదిలాబాద్ జిల్లా ల ఎస్పి లు మాట్లాడుతూ జిల్లా లో శాంతి నెలకొనేందుకు అల్లరి మూకల పైన సోషల్ మీడియా పైన ప్రత్యెక దృష్తి పెట్టి అప్రమత్త తో వున్నాం అని పోలీసులను బృందాలుగా విభజించి డే ,నైట్ పెట్రోలింగ్ లు నిరంతరం ఉండేలా నిర్వహిస్తున్నాం అని ,అంతేకాక సమస్యాత్మక ప్రాంతాలు ,సున్నితమైన ప్రాంతాలలో సిసి కెమెరా లు ఏర్పాటు చేశామన్నారు. మత పరమైన ,సంజ్ఞ పరమైన విద్వేషాలు పెంచేలా వుండే పోస్టర్ లను ,బ్యానర్ లను జిల్లా లొ నిషేధ ఆజ్ఞలను అమలు పరిచాము అని సమస్య చెలరేగిన అదుపులోకి వచ్చేలా పీస్ కమిటీ లను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పి లు , ఐ జి మరియు డి ఐ జి లకు వివరించారు. ఈ సమావేశం లొ నిర్మల్ జిల్లా ఎస్పి విష్ణు వారియర్, కుమ్రం భీమ్( ఆసిఫాబాద్) జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ,ఆదిలాబాద్ జిల్లా ఎస్పిమిట్ట శ్రినివాస్ లు మరియు జిల్లా సిఐ లు , ఎసై లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment