వైకుంఠ ధామం కొరకు భూమిని కేటాయించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24 (వుదయం ప్రతినిధి); వైకుంఠ ధామం (శ్మశాన వాటిక) కొరకు భూమిని కేటాయించాలని శనివారం హిందూ సేవాసమితి ఆధ్వర్యంలో రెబ్బెన తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం హిందూ సేవ సమితి వారు మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో గత కొన్నీ సంవత్సరాలుగా క్రితం స్మశానా నికి కేటాయించిన స్థలాన్ని కబ్జాకు గురైందని ప్రస్తుతము దహన సంస్కారానికి సరైన చోటు లేక రెబ్బెన ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాశ్మన వాటికలు కోసం నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో రెబ్బెన మండల కేంద్రానికి శాశ్వత శ్మశాన వాటిక కొరకై స్థల సేకరణ చేయలని కోరారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ శ్మశాన వాటిక కోసం సర్వ్ నిర్వహించి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రంలో సర్పంచ్ పేసరి వెంకటమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య, మోడెం సుదర్శన్ గౌడ్, గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్, చందూలాల్ అగర్వాల్, అజయ్ జైష్వల్, మడ్డి శ్రీనివాసగౌడ్, దుర్గందేవాజి, మౌడెం చిరంజీవిగౌడ్, అజ్మీరా వస్రం నాయక్, కొయ్యడ రాజాగౌడ్, రామడుగుల శంకర్ ,కుందారపు బాలకృష్ణ, రాపర్తి అశోక్, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు.
No comments:
Post a Comment