కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 02 (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని ఉద్యాన వనంలో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపానికి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనప్ప, పాలనాధికారి చంపాలాల్, జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లు స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మౌనం పాటించారు. అమర వీరులకు జై అంటూ నినాదాలు చేశారు. మొదట మండలి ఛైర్మన్ పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి పోలీస్ పరేడ్ మైదానం చేరుకొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అక్కడా పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనప్ప, జిల్లా పాలనాధికారి చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, జేసీ అశోక్‌కుమార్, ఆర్డీఓలు కదం సురేష్, రమేశ్‌బాబు, జడ్పీటీసీ సభ్యులు ఏమాజీ, అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ తారాబాయి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ శంకరమ్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాక్యతలుగా దీప్తి, లోహిత్, వెంకటేశ్వర్లు, వూషన్నలు వ్యవహరించారు.
No comments:
Post a Comment