Tuesday, 20 June 2017

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీతాల పెంపుపై హర్షాతిరేకం

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీతాల పెంపుపై హర్షాతిరేకం 



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20  (వుదయం ప్రతినిధి); కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీత భత్యాలు పెంచడంతో మంగళవారం రెబెన్న కళాశాల ఒప్పంద అధ్యాపకులు  హర్షం వ్యక్తం చెసి  మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా రెబ్బెన కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ మినిమమ్ బేసిక్  మూలవేతనం పెంచుతూ జీవో నెంబర్ 162ను విడుదల చేయడం పట్ల  ఈ జీతం పెంచడం వలన జిల్లాలోని 123 కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనం కలుగుతుంది . పై  బేసిక్  రావడానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని విద్యార్ధి సంఘాలకు, పార్టీలకు , సమ్మెకాలాలో సహకరించిన నాయకులకు, ప్రింటు మీడియాకు మరియు మాకు జీవో రావడానికి కృషి చేసిన మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావులు, ఎం ఎల్ సి లు పాతూరి సుధాకర్ రెడ్డి,పల్లె రాజేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా మాకు కొన్ని సమస్యలు మమ్ముల్ని కోర్టు సెలక్షన్స్ నుంచి బయటపడేసి మమ్ముల్ని త్వరగా రెగ్యులర్ చేయాలి,మహిళా ఉద్యగులకు మెటర్నిట్  సెలవులు  మంజూరు చేయాలి ,రెగ్యులర్ ఉద్యొగుల మాదిరిగా 24 క్యాజువల్ లీవులు ఇవ్వాలి ,రెగ్యులజేషన్ ఆలస్యమైతే వెంటనే మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలి . ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు బి గంగాధర్, శ్రీనివాస్, ప్రకాష్,ప్రవీణ్,అమరేందర్, వెంకటేష్ మరియు రామారావు, వెంకటేశ్వరీ, మంజుల, నిర్మల,సుమలత,దీప్తి,జాన్సీమని , వరలక్ష్మి, మల్లేశ్వరి,సంధ్య మరియు తదితరులు.పాల్గొన్నారు. 

No comments:

Post a Comment