మధ్యన బోజన పథకాలను స్వచ్చంధా సేవ సంస్థకు అప్పగించరాదు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి); మధ్యన భోజనం పథకాన్ని స్వచ్చంధ సంస్థకు అప్పగించరాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ అన్నారు , గురువారం రెబ్బన మండలం లో తహసిద్దర్ కార్యాలయం ముందు మధ్యన భోజన కార్మికుల తో కలిసి తహసిల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్ధార్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్బంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ మధ్యన భోజన వర్కర్లకు కనీస వేతనం 18000లు ఇస్తూ వారికీ ప్రభుత్వం సరుకులను అందజేయాలన్నారు కోడి గుడ్లకు ప్రత్యేక బడ్జెటు కేటాయించాలన్నారు , వంట గదులు . మంచినీళ్లు , వంట్ట సామాగ్రి మరియు మౌలిక సదుపాయాలను అందజేయాలన్నారు , ఇతర రాష్టాలలో వేతనాలు చెల్లిస్తున్న మన రాష్టం లో చెల్లించడం లేదు అన్నారు . ఈ సమస్యలను వెంట్లనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా నాయకులూ దుర్గం దినాకర్ . మధ్యన భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చాపిడి మాయ దుర్గం పద్మ . తనుబాయి . మల్లికాంబ . సావిత్రిబాయి. గంగక్క తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment