Wednesday, 28 June 2017

డిజిటలైజేషన్ ప్రక్రియతో నేరాల అదుపు లో మరింత పెరిగిన పోలీసుల సమర్ధత - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

డిజిటలైజేషన్ ప్రక్రియతో నేరాల అదుపు లో మరింత పెరిగిన  పోలీసుల సమర్ధత  - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 (వుదయం ప్రతినిధి);     జిల్లా పోలీసు విభాగము ను డిజిటలైజ్ ప్రక్రియతో ఆధునికీకరించడంతో   జిల్లా పోలీసు వ్యవస్థ ఎంతో ముందంజ లో నిలుస్తుందని  జిల్లా  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు , అత్యంత అధునిక సాంకేతిక విజ్ఞానం  ను జిల్లా కు  తీసుకురావడము లో బాగముగానే జిల్లా లో సీ.సీ.టీ.న్.స్   (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం ) ను ఏర్పాటు  చేసాము అని ఈ ఆన్ లైన్  వ్యవస్థ వల్ల దెశం లొని - రాష్ట్రము లొని పోలిసుల మధ్య సమాచార మార్పిడి వేగముగా జరుగుతుందని  పాత   నేరస్థుల వివరాలు ,వారి యొక్క నేరం అవలంబించే పద్దతులను తెలుసుకొని నేరాల నివారణ చేయగలము అని జిల్లా ఎస్పి తెలిపారు .బుదవారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన సమావేశం లో జిల్లా ఎస్పి ,పోలీసు స్టేషను ,సర్కిల్ , సబ్ డివిజన్ ల వారిగా  సీ.సీ.టీ.న్.స్  యొక్క పనితీరు ను సమీక్షించారు ,మరియు సీ.సీ.టీ.న్.స్ యొక్క పని తీరు ను  పరిశీలించి  సంతృప్తి  ఏంటో ఏంటో  వ్యక్తం చేశారు ,జిల్లా లొనే కౌటాల సర్కిల్ సీ.సీ.టీ.న్.స్ పనితీరు లో  మొదటి  స్థానం లో ఉందన్నారు మరియు సీ.సీ.టీ.న్.స్ అసిస్ట్ గా పని చేస్తున్న కానిస్టేబుల్   పీసీ -3233   భూక్యా  గంగాధర్  కు నగదు  ప్రోత్సహకము  గా  2000/- రూపాయలను  అందచెసారు,అంతేకాక ఎంతో కృషి తో కౌటాల సర్కిల్ ను మొదటి స్థానం కు తీసుకువచ్చిన సర్కిల్ ఇనస్పెక్టర్  అచ్చేశ్వర్  రావు ను జిల్లా ఎస్పి గారు అభినందించారు. ఈ కార్యక్రమము లో  డిఎస్పీ హబీబ్ ఖాన్ , ఎస్బి సీ ఐ వెంకటేశ్వర్ , ఆసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీష్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ , జిల్లా లోని సీ ఐ లు ,ఎసై లు ,ఎస్పిసీసీ శ్రినివాస్ మరియు  పి.ఆర్.ఓ మనోహర్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment