Saturday, 17 June 2017

వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి

వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి

  • ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ కార్మికుల పక్షాన పోరాడుతామని ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి S.తిరుపతి  అన్నారు.సింగరేణిలో జరుగుతున్న సమ్మె సందర్భంగా  శనివారం రోజున సమ్మెను విఫలం చేయాలని చూస్తున్న టిబిజికెయస్ నాయకులకు కనువిప్పు కలాగాలని గోలేటిలోని తెలంగాణ తల్లి విగ్రహనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం,టీ.ఆర్.యస్., టిబిజికెయస్ పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన టిబిజికెయస్ గ్రూపులుగా విడిపోయి డబ్బుల విషయంలో కోర్టు చుట్టు తిరుగుతూ నాలుగు సంవత్సరాలు కాలాయపన చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాల పైనే పెడుతానని హమీ ఇచ్చిన కెసిఆర్ మరచిపోయారని అన్నారు. కనీసం కార్మిక చట్టాలపై అవగాహన లేని టిబిజికెయస్ సమ్మెను విఫలం చేయాడానికి చూడడం సిగ్గుచెటన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటే సమ్మెను విఫలం చేయాడానికి యాజమాన్యం టిబిజికెయస్ టి ఆర్ యస్ కుట్రలు పన్నుతుందని దానిని కార్మికులు గమనిస్తున్నరని అన్నారు. యాజమాన్యం ఎప్పుడు లేని విధంగా సింగరేణిలో పోలీసు బలగాలను మోహరించి కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయిస్తుందని దీనిని సిపిఐ పార్టీ ఖండిస్తూందని అన్నారు. అరెస్టు చేసిన కార్మిక నాయకులను వెంటనే విడుదల చేసి పోలీసులను వెనక్కు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే టిబిజికెయస్ కార్మికుల పక్షామో కాదో తెలియజేయాలని, ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల కల్పనకై జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో కలిసి రావాలని లేకుంటే టిబిజికెయస్ కు కార్మికులు తగిన బుద్ధి చేప్తారని హెచ్చరించారు.శనివారం నిర్వహించిన కోల్ బెల్ట్ బంద్ లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య, ఎఐటియుసి నాయకులు శేషు, కిరణ్, అంబేద్కర్, శ్రీనివాస్, సత్యనారాయణ, చారి,నర్సయ్య, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment