Monday, 12 June 2017

బాదితుల సమస్యను పోలీసు అధికారులే స్వయం గా తెలుసుకోవాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


బాదితుల సమస్యను పోలీసు అధికారులే స్వయం గా తెలుసుకోవాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 12  (వుదయం ప్రతినిధి); పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులను  పోలీసు అధికారులే స్వయముగా తెలుసుకోవాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి అద్వర్యం లొ ప్రజా ఫిర్యాదుల విబాగం ను నిర్వహించారు,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుల ను జిల్లా ఎస్పి స్వయముగా స్వీకరించారు, సోమవారం ఫిర్యాదుల విబాగములో స్వతంత్ర సమరయోధుడు  ఆసిఫాబాద్ కు చెందిన దండనాయకుల శ్రీనివాసు రావు గారు రావటం జరిగింది , జిల్లా ఎస్పి వారిని సాదరముగా ఆహ్వానించి ,వారి యొక్క సమస్యను విని ,సత్వరం పరిష్కారం అయ్యేలా తగు చర్య ను తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ జిల్లా పోలీసులు శాంతి భద్రతల తో పాటు గా  జిల్లా లోని మారుమూల ప్రాంతాల లోని ప్రజలతో మమేకంఅయి వారికీ నేరాలు, విత్తనమోసాలు పట్ల అవగాహనకలిపిస్తూ వారిని చైతన్య వంతులను చేసే ల కార్యక్రమాలనుచేపడుతున్నామని తెలిపారు. ఖరిఫ్ ప్రారంభం అవుతున్నదున నకిలీ విత్తనాలు జిల్లా లొ ప్రవేశించకుండ చర్యలు తిసుకుంటాం అని తెలిపారు. జిల్లా లోని పోలీసు లు అందరు తమ వంతు గా గిరిజన గ్రామాల లోని పిల్లలు బడికి వెళ్ళాలా వారి తలిదండ్రులకు అవగాహన కలిపించాలి అని జిల్లా ఎస్పి ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు  ,డిసీబీ ఎసై రాణాప్రతాప్ ,అసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్  ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత గార్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment