Wednesday, 21 June 2017

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ; ఏఐఎస్ఎఫ్

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ; ఏఐఎస్ఎఫ్



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21  (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని ప్రభుత్వ ప్రాధమిక,ప్రాధమికోన్నత,ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,మెరుగైన వసతులు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  బుధవారం నాడు రెబ్బెన  మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు  ధర్నా చేపట్టడం జరిగింది.అనంతరం కార్యాలయంలోని ఇంచార్జి కృష్ణా కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ లు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకోన్న సమస్యల పై ధర్నా కార్యక్రమాలు నిర్వించడంలో భాగంగా రెబ్బెన లో కూడా నిర్వహించడం జరిగిందని,విద్య సంవత్సరం ప్రారంభమయ్యి నేటికీ రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేదని అన్నారు.అదే విధంగా ప్రతి పాఠశాలల్లో కనీస వసతులు అయిన త్రాగు నీరు,మరుగుదొడ్లు వసతి విధిగా కల్పించాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించాలని,నాణ్యమైన,రుచికరమైన భోజనాన్ని అందించాలని అన్నారు.ప్రతి తరగతికి ఒక్క ఉపాధ్యాయున్ని కేటాయించాలని,ప్రతి తరగతి  గదిలో వెలుతురు,గాలి(FAN) సౌకర్యాలు కల్పించాలని,పూర్తి  స్థాయిలో పాఠ్య పుస్తకాలను అందించాలని,అన్ని పాఠశాలలకు క్రీడా మైదానాలు,ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు.విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మలిశెట్టి మహిపాల్,నాయకులు జెటంగుల సంజయ్,సాయి అంజన్న,దేవేందర్,కట్ల సాయి,రావుజీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment