Sunday, 18 June 2017

కొండపల్లి లో జరిగిన హత్యా కేసులో ఇద్దరు అరెస్ట్

కొండపల్లి లో  జరిగిన హత్యా కేసులో ఇద్దరు అరెస్ట్ 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18  (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో ఈ నెల 12 న జరిగిన గుర్లె  గణపతి (46) హత్యా కేసులో రెబ్బెన పొలిసులు చేరవాణి ఆధారం చేసుకుని నిందుతులని కస్టడీ లోనికి తీసుకుంట్ల సి ఐ మదన్ లాల్ తెలిపారు. ఆదివారం రెబ్బెన   పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలా  తెలిపిన వివరాల ప్రకారం కొండపెల్లికి చెందిన గుర్లె గణపతి(46) కి సుశీల (38) తో గత 20సవంత్సరాల క్రితం వివాహం అయింది కొంతకాలం వారి సంసారం సజావుగానే సాగినప్పటికి ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం గణపతి చేడు వ్యసనాలకు బానిసై ఖర్చుల కోసం 3ఎకరాల భూమి తో పాటు 2ఆటోలను అముకున్నాడు. అనంతరం కాగజ్ నగర్  ఎక్స్ రోడ్ లో  ట్రాక్టర్ యజమాని వద్ద  సూపర్ వైసర్ గా 7000 జీతానికి విధులు నిర్వాసిస్తూ రాత్రి వేళలో సైతం అక్కడే ఉండే వాడు అన్నారు. ఈ క్రమం లో అదే గ్రామానికి చెందిన మహమ్మద్ జాకిర్ అలీ (20) తో సుశీలకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది . భర్త వ్యసనాలకు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మడం తో పాటు జాకిర్ తో ఏర్పడిన అక్రమ సంబంధం తో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అందుకు గాను నిధితురాలు జాకిర్ సహాయం కోరింది దీనితో ప్రియుడు కాగజ్ నగర్ మౌనిక మెడికల్ నుండి ఏడు నిద్రమాత్రలు తీసుకు వచ్చి సుశీలకు ఇచ్చి వీటిని కూరలో కలిపి భర్తకు తినిపించాలని తిన్న అనంతరం  నిద్రమత్తులో ఉండగా చంపడం సులువుగా ఉంటుందని సలహా ఇచ్చాడు. ఈ  నెల 11న రాత్రి  వేళలో సుమారు 8;30 ప్రాంతం లో చికన్ కూర వండి భర్త కోసం వేరుగా తీసి నిద్రమాత్రలు కలిపి అన్నంలో  పెట్టడంతో అది తిన్న గణపతి గాఢనిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తెల్లవారు జామున 2గంటల  ప్రాంతంలో భర్తను మెడపై గోడ్డలితో దారుణంగా నరికి చంపినట్టు సి ఐ మదన్ లాల్ తెలిపారు. మృతుడు తమ్ముడు గుర్లె బాబురావు ఇచ్చిన పిర్యాదు మేరకు విధులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వీరితోపాటు ప్రత్యేక పొలిసు బృందం శ్యామ్ రావు, రవీందర్, విజయలక్ష్మి, హోంగార్డ్ శ్రీనివాస్ లు  ఉన్నారు.   

No comments:

Post a Comment