Tuesday, 13 June 2017

భాజపా గడప గడపకు ప్రచరం

భాజపా గడప గడపకు ప్రచరం 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13  (వుదయం ప్రతినిధి); కేంద్ర  పార్టీ ఆదేశాల మేరకు  పండిత్ దన్ దయిల్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్బంగా ప్రతి గ్రామల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను  ప్రతి గడప గడపకు తెలియజేస్తుంట్లు  భాజపా కొమురం భీం  జిల్లా అధ్యక్షుడు జె పి పౌడల్  తెలిపారు. ఈ సందర్బంగా  మంగళవారం రెబ్బన మండలకేంద్రంలో  గడప గడపకు ప్రచారకార్యక్రమం నిర్యహించారు. భాజపా కొమురం భీం  జిల్లా అధ్యక్షుడు జె పి పౌడల్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి మరియు డబుల్ బెడ్  రూమ్ ఇళ్లను  ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. అదే విదంగా ఈ కార్యక్రమంలో కౌటాల మండల  కమిటీని నియమించడం జరిగందని తెలిపారు.  ఈ కార్యక్రంలో  రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు అమర్ సింగ్ తిలావత్ ,సీనియర్ నాయకులూ ఇందురి వెంకటేశం  సిర్పూరు అసంబ్లీ కన్వీనర్ కొంగు సత్యనారాయణ ,గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శిగా  కుడ్మత ముత్తయ్య , రాజేష్ మరియు నాయకులూ పాల్గున్నారు.       

No comments:

Post a Comment