Friday, 30 June 2017

ఒప్పంద అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలి

ఒప్పంద  అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ల పునరుద్ధరణలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 223ను పునరుద్ధరించి జీవో నెంబర్  302ను   ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి ప్రభుత్వం  తీసుకువచ్చే ప్రయత్నం చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3687 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని,వెంటనే అలంటి ఆలోచనలను విరమించుకోవాలని  ఆర్జేడీ సంఘం రాష్ట్రా కోశాధికారి బుర్రి రాజు అన్నారు.శుక్రవారంనాడు రెబ్బేనకు వచ్చిన ఆయన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రoలోని ఒప్పంద అధ్యాపకులు ఎదురుకుంటున్న సమస్యలపై ,ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కారించాలని కోరారు.ఈ సమావేశం లో ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment