Monday, 5 June 2017

హమీల అమలులో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్...


                      హమీల అమలులో ప్రభుత్వం విఫలం ;
 ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్...

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 05  (వుదయం ప్రతినిధి);     రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు విద్యారంగానికి ఇచ్చిన హమీల అమలులో పూర్తిగా విఫలం చెందారని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,ITI,POLYTECHNIC కళాశాలలు ఏర్పాటు చేయాలని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ గారికి ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం దుర్గం రవీందర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,జిల్లాలో ఐటిఐ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని గతంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందించామని అన్నారు. పాలకులు కేవలం హమీలతోనే సరిపెడుతున్నారని అన్నారు.అనేక సార్లు ప్రజా ప్రతినిధులు హమీలు ఇచ్చారని అన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నరని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరంగా ఉన్నరని జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా జిల్లాలో కనీస వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఉన్నాయని వాటిని అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలు విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నరని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు,యునిఫార్మ్,టై,బెల్ట్ తదితర వస్తువులను విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అలాంటి యాజమాన్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ,ఐటీఐ,పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయించాలని లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని దీనికి పూర్తి బధ్యత ప్రభుత్వం ,ప్రజా ప్రతినిధులు,అధికారులే వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి, నాయకులు మహిపాల్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment