ఆధునిక సాంకేతికత తోనే నేరరహిత సమాజం సాద్యం – ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 (వుదయం ప్రతినిధి); ఆధునిక సాంకేతికత ను అందిపుచ్చుకుంటూ,సమాజం లొ పాత మరియు సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికి ఆదునిక వ్యవస్థ ను జిల్లా పోలీసులు ప్రవేశ పెట్టారు ,జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పోలిసుల విచారణ సులభతరం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా CCTNS, రాపిడ్ కాప్స్ లాంటి కార్యక్రమాలు వంటివి వి ప్రవేశ పెట్టారు,అదే బాటలో అనుమానితులను, ఆరోపించబడిన వ్యక్తులను తక్షణo నిర్దారించుకుందుకు జిల్లా ఎస్పి స్థానిక AR హెడ్ క్వార్టర్ లోని నూతన కాన్ఫరెన్స్ హాల్ లొ మంగళ వారం రోజున జిల్లా లోని లో పోలీసు అదికారులందరికీ నూతనముగా జిల్లా లొ ప్రవేశపెట్టబడిన AFIS( ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) లో బాగము గా 1) ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ 2) మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ల వంటి ఆటోమేటిక్ సాధనాలను జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ జిల్లా అధికారులకు పరిచయo చేసి ,శిక్షణ కార్యక్రమము ను జిల్లా లొ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమము లొ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆస్థి నేరాలు , నేర గుర్తింపునకు మరియు నేరాల పెరుగుదలను దృష్ట్యా జిల్లా లోని పోలీసు స్టేషన్ కు వీటిని అందించనున్నామని ఆధునికత వైపు జిల్లా పోలీసులు ముందు వున్నారని ఈ సాంకేతికతను వాడుకొని కేసు లను త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు ,CLUES( క్రైమ్ లేబొరటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టం ) మరియు AFIS లకు జిల్లా ఎస్పి గారి స్వీయ పర్యవేక్షణలో ఒక సబ్ ఇనస్పెక్టర్ J.శ్యాం సుందర్ మరియు పీసి లు A. తిరుపతి మరియు J.శ్రినివాస్ లను ఈ విబాగం పటిష్టతకు క జిల్లా ఎస్పి నియమించారు. ఈ కార్యక్రంలో ఎస్బి సీ ఐ వెంకటేశ్వర్ , ఆసిఫాబాద్ టౌన్ సీ ఐ సతీష్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ , జిల్లా లోని సీ ఐ లు ,ఎసై లు ,ఎస్పిసీసీ శ్రినివాస్ మరియు పి.ఆర్.ఓ మనోహర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment